మేదరమెట్ల చెరువుకు నీరిస్తాం

ABN , First Publish Date - 2021-01-14T05:03:27+05:30 IST

యర్రం చినపోలి రెడ్డి ఎత్తిపోతల పథకం పైపులైన్‌ నుంచి మేదర మెట్ల మల్లెలచెరువుకు నీరిచ్చేలా చూస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.

మేదరమెట్ల చెరువుకు నీరిస్తాం
తన మేనత్తను పరామర్శిస్తున్న చైర్మన్‌ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి


మేదరమెట్ల, జనవరి 13 : యర్రం చినపోలి రెడ్డి ఎత్తిపోతల పథకం పైపులైన్‌ నుంచి మేదర మెట్ల మల్లెలచెరువుకు నీరిచ్చేలా చూస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవారం స్వ గ్రామమైన మేదరమెట్లకు వచ్చిన సుబ్బారెడ్డి తొ లుత  వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్యతో కలిసి వైఎస్సార్‌ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అ నంతరం స్వగృహంలో ఆయనను గ్రామస్థులు క లిసి మల్లెలచెరువుకు నీరిప్పించాలని వినతిప త్రం అందజేశారు. దీనిపై స్పందించిన వైవీ, నీ టిపారుదలశాఖ మంత్రితో మాట్లాడి చెరువుకు నీరిప్పిస్తానని హామీ ఇచ్చారు.  అనంతరం ఆ యన అనమనమూరు వద్ద ఉన్న ఫాంహౌస్‌కు కుటుంబసమేతంగా వెళ్లారు. గురువారం మేదర మెట్లలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనను న్నారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్‌ చై ర్మన్‌ కొమ్మూరి కనకారావు, బీసీ కార్పొరేషన్‌ చై ర్మన్‌ మనోహర్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ రత్నారెడ్డి, సాధినేని మస్తాన్‌రావు, కోయి అంకారావు, జజ్జర ఆనందరావు, రాధాకృష్ణమూర్తి  పాల్గొన్నారు.


మేనత్తను పరామర్శించిన వైవీ


పంగులూరు: టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి బుధవారం కొండమూరులో అల్లుడు భీమనా థం, అంజిరెడ్డి ఇంట్లో నివాసముంటున్న తన మేనత్త తాడిపర్తి వెంకటసుబ్బమ్మ పరామర్శిం చారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


Updated Date - 2021-01-14T05:03:27+05:30 IST