వార్డెన్ రంగారావు బదిలీ
ABN , First Publish Date - 2021-01-21T05:17:04+05:30 IST
పట్టణంలోని బీసీ-2 బాలుర వసతి గృహ సంక్షేమ అధికారిచెన్నశెట్టి రంగారావుకు ఉద్యోగోన్నతి కల్పిం చారు.

పామూరు, జనవరి 20 : పట్టణంలోని బీసీ-2 బాలుర వసతి గృహ సంక్షేమ అధికారిచెన్నశెట్టి రంగారావుకు ఉద్యోగోన్నతి కల్పిం చారు. ఆయన్ను సహాయ వెనుకబడిన సంక్షేమ అధికారిగా గుం టూరు జిల్లా పొన్నూరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందాయి. హా స్టల్ వార్డెన్‌గా గత 21 సంవత్సరాల నుంచి పనిచేస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పర్యాయాలు ఉత్తమ వసతి గృహ సంక్షేమ అధి కారిగా రంగారావు అవార్డులు అందుకున్నారు. హాస్టల్ నిర్మాణానికి స్థల సేకరణ, దాతల ద్వారా కాం పౌండ్ వాల్, వేధిక నిర్మాణం, మం చినీటి వసతి లాంటి కార్యక్రమాలు చేపట్టి మండల ప్రజల మన్న నలు పొంది ఉన్నారు. రంగారావుకు ఉద్యోగోన్నతిపై పలువురు అభినందనలు తెలిపారు.