ఉపకార వేతనాల పంపిణీ

ABN , First Publish Date - 2021-06-20T05:50:22+05:30 IST

పట్టణంలోని జంగంగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ ఎరువుల కంపెనీ సహకారంతో కోరమండల్‌ గర్ల్‌ చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ స్కీమ్‌ ద్వారా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన బాలికలకు ఉపకార వే తనాలను అందచేశారు.

ఉపకార వేతనాల పంపిణీ
విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్న ఎంఈవో

కంభం, జూన్‌ 19 : పట్టణంలోని జంగంగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ ఎరువుల కంపెనీ సహకారంతో కోరమండల్‌ గర్ల్‌ చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ స్కీమ్‌ ద్వారా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన బాలికలకు ఉపకార వే తనాలను అందచేశారు. మార్కాపురం డివిజన్‌లో ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన బాలికలకు ప్రోత్సాహకరంగా ఉపకార వేతనాలు అందచేస్తున్నట్లు నిర్వాహకులు గ్రోమోర్‌ జనరల్‌ మేనేజర్‌ సచిదానందరెడ్డి తెలిపారు. ఎంఈవో వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయురాలు శర్వాని విద్యార్ధిణులకు ఉపకార వేతనాలను అందచేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-20T05:50:22+05:30 IST