విద్యాభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-07-12T05:55:09+05:30 IST

విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎంఈవో బీ.మస్తాన్‌నాయక్‌ అన్నారు.

విద్యాభివృద్ధికి కృషి చేయాలి
నియామక పత్రాలు అందజేస్తున్న ఎంఈవో మస్తాన్‌నాయక్‌

పెద్ద దోర్నాల, జూలై 11 : విద్యార్థుల విద్యాభివృద్ధికి  కృషి చేయాలని ఎంఈవో బీ.మస్తాన్‌నాయక్‌ అన్నారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో నూతనంగా 2008 డీఎస్సీలో అర్హత పొంది 22 మంది ఉపాధ్యాయులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఉపాధ్యాయులను భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేసిన మంత్రి సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.      కార్యక్రమంలో యూటీఎఫ్‌ అధ్యక్షుడు షేక్‌ షరీఫ్‌, కౌన్సిల్‌ సభ్యులు మొద్దు నాగేశ్వరరావు, శ్రీకాంత్‌, వర్ధన్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

వై.పాలెంలో.. 

ఎర్రగొండపాలెం  : ఎర్రగొండపాలెం మండలానికి  22 మంది డీఎస్సీ - 2008 ఉపాధ్యాయులను నియమించారు. ఆదివారం ఎంఈవో పి.ఆంజ నేయులు నుంచి ఐదుగురు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. నూ తన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలకు వెళ్లి విధుల్లో చేరారు. వెంకటాద్రిపాలెం,  గంజివారిపల్లె,  గంగపాలెం, వీరాయపాలెం ప్రాథమిక పాఠశాలలో వారు ఉపాధ్యాయులుగా చేరారు. వారికి యూటీఎఫ్‌, ఎస్టీ యూ సంఘాల నాయకులు స్వాగతంపలికారు.   

Updated Date - 2021-07-12T05:55:09+05:30 IST