వైభవంగా వేంకటేశ్వరుని కల్యాణం

ABN , First Publish Date - 2021-12-09T05:45:46+05:30 IST

గుండ్లకమ్మ నదీతీరాన వెలసివున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా బుధ వారం స్వామికి కల్యాణం నిర్వహించారు.

వైభవంగా వేంకటేశ్వరుని కల్యాణం

మార్కాపురం (వన్‌టౌన్‌), డిసెంబరు 8 :  గుండ్లకమ్మ నదీతీరాన వెలసివున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా బుధ వారం స్వామికి కల్యాణం నిర్వహించారు. అర్చకుడు ఏవీకే నరసింహాచార్యులు వేం కటేశ్వరస్వామి మూలవిరాట్‌కు సుప్రభాత సేవ, అభిషేకాలు, అలంకరణ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటే శ్వరుని ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాలు నిర్వహించారు. 8 మంది భక్తులు కల్యాణ ఉభయదాతలుగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.


Updated Date - 2021-12-09T05:45:46+05:30 IST