కొవిడ్ సెంటర్‌కు రూ.5లక్షలు విరాళం
ABN , First Publish Date - 2021-05-20T06:31:10+05:30 IST
కరోనా విపత్కర పరిస్థితుల్లో స్థానిక రి మ్స్‌లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన కొవిడ్ కే ర్ సెంటర్‌కు ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి రూ.5 లక్షల చెక్కు ను అందజేశారు.

ఒంగోలు(కలెక్టరేట్), మే 19 : కరోనా విపత్కర పరిస్థితుల్లో స్థానిక రి మ్స్‌లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన కొవిడ్ కే ర్ సెంటర్‌కు ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి రూ.5 లక్షల చెక్కు ను అందజేశారు. స్థానిక లాయర్‌పేటలోని మంత్రి నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బాలినేనికి ఆయన చెక్కును అందజేశారు. కార్యక్ర మంలో మేయర్ గంగాడ సుజాత, వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెం కట్రావు, అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ ఫంగస్ బాధితుడికి బాలినేని సాయం
ఒంగోలు (కార్పొరేషన్): బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలో చికిత్స పొందుతున్న ఒంగోలు సీతారాంపురంనకు చెందిన పందికట్ల శ్రీనివా సరావుకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆర్థికసాయం చేశారు. బుధవారం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి బా లినేనిని బాధితుడు స్నేహితులు కలిసి సహాయం కోరారు, స్పందించిన మంత్రి తనవంతుగా రూ.50 వేలు నగదు అందజేసి త్వరగా కోలుకోవాల ని ఆకాంక్షించారు. రిమ్స్‌లో బ్లాక్‌ఫంగస్‌తో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు బాలినేని సూచించారు.