ముమ్మరంగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-06-21T06:33:50+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్‌.నాగరాజ్యలక్ష్మి పేర్కొన్నారు.

ముమ్మరంగా వ్యాక్సినేషన్‌
కొండపిలో వృద్ధునికి వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

కనిగిరి : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ ఎన్‌.నాగరాజ్యలక్ష్మి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో వ్యాక్సిన్‌ వేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు ఎస్తేరురాణి, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా, కార్యకర్తలు పాల్గొన్నట్లు చెప్పారు. అదేవిధంగా కనిగిరి మండలంలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఐదేళ్లు లోపు చిన్నారుల తల్లులకు, 45 ఏళ్లు దాటిన వారికి మొదటి డోసు వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్‌  ప్రక్రియ సాగింది. ఈ ప్రక్రియను ఎంపీడీవో మల్లిఖార్జునరావు, తహసీల్దార్‌ పుల్లారావు, కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ బృందం మండలంలో పర్యటించి సచివాలయాల్లో, గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. 

వెలిగండ్ల : కరోనా వైరస్‌ నిర్మూలనకు ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసిందని డాక్టర్‌ ఫిరోజ్‌ పేర్కొన్నారు. మండలంలోని 12 సచివాయాల కేంద్రాల్లో ప్రజలకు ఆదివారం కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యులు తెలిపారు. నాగిరెడ్డిపల్లి పీహెచ్‌సీ పరిధిలో 500ల డోసులు, వెలిగండ్ల పీహెచ్‌సీకి 500 డోసులు వచ్చినట్లు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రజలకు మొదటి డోసు వేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్‌ వేయించుకొని వైరస్‌ నియంత్రణకు సహకరించాలని కోరారు. 

కొండపి : కరోనా నివారణలో భాగంగా మండలానికి మూడు వేల డోసులు కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ కేటాయించగా, ఆదివారం మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ చేశారు.  కె. ఉప్పలపాడులోని సచివాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.వి. నారాయణరావు పరిశీలించారు. కొండపిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో పెట్లూరు పీహెచ్‌సీ డాక్టర్‌ సునీల్‌ గవాస్కర్‌, కొండపి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సీడీపీవో విజయకుమారి, సూపర్‌వైజర్‌ సుశీలాదేవి ఆశ, వైద్యఆరోగ్యశాఖ, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు. 

లింగసముద్రం : మండలంలో ఆదివారం చేపట్టిన వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. లింగసముద్రం 1, 2 సచివాలయాలతో పాటు, యర్రారెడ్డిపాలెం, తిమ్మారెడ్డిపాలెం, మాలకొండరాయునిపాలెం, వీఆర్‌కోట, అన్నెబోయినపల్లి, చినపవని, పెదపవని, ముత్యాలపాడు, పెంట్రాల, మొగిలిచెర్ల గ్రామాలలోని సచివాలయాల్లో 1001 మందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌  వేసినట్టు తహసీల్దార్‌ ఆర్‌ బ్రహ్మయ్య, పీహెచ్‌సీ వైద్యాధికారి రమేష్‌లు చెప్పారు. 

ముండ్లమూరు : ముండ్లమూరు, మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 1049 మందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసినట్టు వైద్యాధికారులు సీహెచ్‌ మనోహర్‌రెడ్డి, టీ వనజారెడ్డిలు తెలిపారు. 

వలేటివారిపాలెం : మండలంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆదివారం తహసీల్దారు సయ్యద్‌ముజిపర్‌రెహ్మన్‌, ఎంపీడీవో రపీద్‌అహమద్‌లు పరిశీలించారు. 15 గ్రామ సచివాలయాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు చెన్నిబోయిన ఓబులుకొండయ్య, ఇరపని సతీష్‌, డేగా వెంకటేశ్వర్లు, యాళ్ల సుబ్బరాజ్యం, పారాబత్తిన కొండమ్మ, వింజం వెంకటేశ్వర్లు, మన్నం వెంగమ్మ, కొల్లూరు లక్షమ్మ, నవ్వులూరి రాజారమేష్‌, అత్తోటి అంజమ్మ, వైసీపీ నాయకులు పరిటాల వీరాస్వామి, కట్టా హనుమంతరావు, అనుమోల వెంకటేశ్వర్లు, యాళ్ల శివకుమార్‌రెడ్డి, దామా వెంకటేశ్వర్లు, మన్నం వెంకటరమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

టంగుటూరు : మండలంలోని 18 సెంటర్‌లలో కొవిడ్‌ నివారణకు 2,128 మందికి ఆదివారం వ్యాక్సినేషన్‌ వేశారు. కార్యక్రమాన్ని వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ మాదాసి వెంకయ్య, వెలుగు పీడీ బాబూరావు, డీఎంఅండ్‌హెచ్‌వో రత్నావళి పరిశీలించారు. 

పామూరు : కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహలు వీడి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పీడీ సీనారెడ్డి, కందకూరు డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌వో ప్రియంవధలు తెలిపారు. పామూరులో జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. పామూరు మండలంలో 19 గ్రామ సచివాలయాల ద్వారా 2000 మందికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేశామన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారికి, 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో తహసీల్దార్‌ సీహెచ్‌ఉష, ఎంపీడీఓ ఎం.రంగసుబ్బరాయుడు, ఈవోపీఆర్‌డీ వి.బ్రహ్మానందరెడ్డి, డాక్టర్లు పి రాజశేఖర్‌, కె కామాక్షయ్య, డాక్టర్‌ పద్మసాయి ప్రశాంతి, అంగన్‌వాడీ, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, వీఆర్‌వోలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

సీఎ్‌సపురం : మండలంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మండలంలోని అన్ని సచివాలయాలలో కలిపి మొత్తం వెయ్యి మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు వారు తెలిపారు.

సింగరాయకొండ : వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య అధికారులకు జేసీ చేతన్‌ సూచించారు. ఆదివారం స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా స్థానిక పంచాయితీ కార్యాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేతన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు. 45 ఏళ్లు పైబడిన వారితో పాటు ఐదేళ్లలోపు ఉన్న చిన్నారుల ఉన్న తల్లలకు వ్యాక్సినేషన్‌ వేసేందకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో షేక్‌ జమీవుల్లా, వైద్యాధికారి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

తాళ్లూరు : మండలంలో చేపట్టిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంలో భాగంగా 1302మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యులు బంకా రత్నం చెప్పారు. తాళ్లూరు, తూర్పుగంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో వైద్యసిబ్బంది  వ్యాక్సిన్‌వేశారు. ఆ గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సిన్‌ తీరును ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, ఎంఈవోలు జి.సుబ్బయ్యలు పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైద్యులు షేక్‌ ఖాదర్‌మస్తాన్‌బీ, ఆరోగ్యకార్యకర్తలు పాల్గొన్నారు.

దొనకొండ : మండలంలో చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో 500 మందికి కరోనా టీకాలు వేసినట్లు స్థానిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిణి సునీత చెప్పారు.  మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో 290 మంది 5 సంవత్సరాలు లోపు పిల్లలున్న తల్లులకు, 210 మంది 45 సంవత్సరాలు దాటిన వారికి వాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వైద్యాధికారి సురేష్‌ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యకేంద్రం సిబ్బంది, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

గుడ్లూరు : ప్రతి ఒక్కరూ కరోనాపై అవగాహన కలిగి అధైర్యపడకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, కందుకూరు ఆర్‌డీవో వసంతబాబు చెప్పారు. గుడ్లూరులో ఆదివారం నిర్వహించిన కరోనా రెండో మోతాదు కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1800 మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యకేంద్రం డాక్టర్‌ మారుతీరావు, తహసీల్దార్‌ శ్రీశిల్ప, గ్రామ సర్పంచ్‌ పాలకీర్తి శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:33:50+05:30 IST