శివారు గ్రామాలపై చిన్నచూపు..!

ABN , First Publish Date - 2021-10-20T05:46:26+05:30 IST

శివారు గ్రామాలపై అటు పాలకులు, ఇటు అధికారులు చిన్నచూపు చూ స్తున్నారు.

శివారు గ్రామాలపై చిన్నచూపు..!
గిద్దలూరు నియోజకవర్గంలోని శివారు గ్రామం

సమస్యలతో ఇబ్బందిపడుతున్న ప్రజలు

వసతుల కల్పన, అభివృద్ధిని 

పట్టించుకోని పాలకులు 

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 19 : శివారు గ్రామాలపై అటు పాలకులు, ఇటు అధికారులు చిన్నచూపు చూ స్తున్నారు. గ్రామ సచివాలయాల పరిధిలోని శివారు గ్రామాలపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఆ గ్రామాలను సచివాలయ సిబ్బంది సందర్శించిన సందర్భాలే లేవు. ఒకటి రెండు చోట్ల కాదు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారా అందరి స మస్యలు పరిష్కారమవుతాయని చెప్తున్న పాలకుల మా టలకు ఇక్కడ సచివాలయ అధికారులు, సిబ్బంది తీరుకు పొంతన లేదు. తమ సమస్యలు ఎవరు తీరు స్తారని శివారు ప్రాంత ప్రజలు నిలదీస్తున్నారు. కనీస మౌలిక సౌకర్యాల కల్పనపై కూడా దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గ్రా మ సచివాలయాలను నిత్యం కలెక్టర్‌, జేసీలు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్‌, ఎంపీడీవో వంటి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో సంక్షేమ పథకాలు ఎం తమందికి ఇచ్చారు. వారి వివరాలను గోడలపై అతికించారా, లేదా, స్పందనలో వినతులు ఎన్ని పరిష్కరించా రు, సిబ్బంది హాజరుశాతం సమయానికి వస్తున్నారా, లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. రికార్డులు తనిఖీలు చేస్తున్నారు.  నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, డిజిటల్‌ గ్రంథాలయాల ప్రగతిని కూడా అడిగి తెలుసుకుంటున్నారే తప్ప శివారు గ్రామాల అభివృద్ధి మాటే వారే ఎత్తడం లేదు. అసలు శివారు ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన కూడా అధికారులకు లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచి వాలయాల వచ్చి వెళ్తున్నారే తప్ప తమ బాధలు, ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి  ఎలావుంది.. శివారు గ్రామాలు అభివృద్ధి చర్యలు తదితర విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లాలోని చాలాచోట్ల పంచాయతీల పరిధిలోని శివార్లలో ఉన్న గ్రామాల పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ అభివృద్ధి పనులు, నీరు, రోడ్డు, పారిశుధ్యం, ప్రజారోగ్యంపై అధికారుల పర్య వేక్షణ లేదని తమపై చిన్నచూపు చూస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గత 4 నెలలుగా గ్రామా ల్లో పారిశుధ్య పనులు కూడా చేపట్టలేదని వారు చెప్తు న్నారు. దీంతో గ్రామాలు కంపుకొడుతున్నాయని, ఈగలు, దోమలతో రోగాలబారిన పడుతున్నామని వారు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు.  అధికారుల పర్యవేక్షణ మాట అటుంచితే సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది కూ డా శివారు గ్రామాల సమస్యలపై స్పందించడం లేదని చెప్తున్నారు.  కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది మూమెం ట్‌ రిజిస్టర్‌లో శివారు గ్రామాలకు  వెళ్తున్నట్లు నోట్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్థులు విమర్శిస్తు న్నారు. ఇప్పటికైనా శివారు గ్రామాల్లో సమస్యలను తెలు సుకొని యుద్ధప్రాతిపదికన పరిష్కార చర్యలు తీసుకు నేలా అధికారులు, పాలకులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-20T05:46:26+05:30 IST