ఇసుకే కాదు మట్టినీ మింగేస్తున్నారు

ABN , First Publish Date - 2021-05-03T05:20:31+05:30 IST

మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది.

ఇసుకే కాదు మట్టినీ మింగేస్తున్నారు
అనుమతిలేని దారకానిపాడు మన్నేరు రేవులో భారీగా తీసిన గోతులు

అరకొర అనుమతులతో తవ్వకాలు

రహస్య మార్గాలద్వారా తరలింపు

అధికారుల కంటితుడుపు చర్యలు

పడిపోతున్న భూగర్భజలాలు

ఆందోళన చెందుతున్న ప్రజలు

 గుడ్లూరు, మే 2: మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది.  ప్రధానంగా గుండ్లపాలెం, పరకొండపాడు మన్నేరు రీచ్‌ల వద్ద అరకొర అనుమతులు తీసుకుని ఇసుకను ఇష్టానుసారం త వ్వుతూ తరలిస్తున్నారు. 

అంతేగాక ఒక్కటి, రెండు ట్రిప్పులకు మాత్రమే సచివా లయ కేంద్రాల్లో అనుమతులు తీసుకుని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. గుడ్లూరులోని సీసీ కెమెరాలకు సైతం దొరకని రహస్య మార్గాల ద్వారా తెల్లవారుజామున తరలిస్తున్నారు. అదే స్థాయిలో రేవు నుంచి మట్టి రవాణా కూడా గుట్టూచప్పుడు కాకుండా సాగుతోంది. ముఖ్యంగా అధికారులు అందుబాటులో లేని ఆదివారాన్నే ఆసరా చేసుకుని మట్టి, ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. 

తాజాగా నిన్నటి ఆదివారం కొత్తపేట చెరువులో 13 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు,  ప్రస్త్తుతం లెవలిం గ్‌ పేరుతో అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా, మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగుతున్నా పోలీస్‌, రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నా రని ప్రజలు విమర్శిస్తున్నారు.         

దారకానిపాడు, దప్పళంపాడు, గుండ్లపాలెం గ్రా మాలకు ఆనుకుని ఉండే మన్నేరులోని ఇసుకను తవ్వేందుకు ఎక్స్‌కవేటర్‌లతో భారీగా గోతులు తీశారు. దీంతో  ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగం టాయని చెబుతున్నారు. 

సెలవు రోజున ఇష్టారాజ్యంగా తవ్వకాలు

వీఆర్‌ కోట(లింగసముద్రం), మే 2: మండలంలోని వీఆర్‌ కోట మన్నేరు నుంచి సెలవు రోజున కూడా ఇ సుక ఇష్టారాజ్యంగా అక్రమంగా తరలిపోతోంది. సెల వు, పండుగ రోజులు ఇసుక అక్రమ రవాణాదారులకు వరంగా మారాయి. ఆ రోజుల్లో అధికారులు ఉండక పోతుండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని గ్రా మస్థులు చెబుతున్నారు. ఆదివారం గ్రామానికి చెం దిన ఒకరు మన్నేరు నుంచి ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తర లిస్తుండడంతో పోలీస్‌, ఎస్‌ఈబీ అధికారులకు సమా చారమిచ్చినట్టు  వంకాయలపాటి మాల్యాద్రి మరి కొందరు చెప్పారు. ఇటీవల వారం క్రితం సాయంత్రం 6, 7 గంటల సమయంలో కూడా ఇసుక తరలిస్తుం డడంతో ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. మన్నేరులో ఇసుక తరలిస్తుండడంతో మంచినీటి పైపులు, రైతుల బోర్లకు చెందిన పైపులు పగిలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-03T05:20:31+05:30 IST