నేడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2021-02-02T04:50:55+05:30 IST

ప్రముఖ వాగ్గేయకారులు, స్వరనీరాజన చక్రవర్తి త్యాగరాజ స్వా మి ఆరాధనోత్సవాలు అర్థవీడు మండలం కాకర్లలో ఈనెల 2వ తేదీ మం గళవారం జరుగుతాయని త్యాగరాజ స్వామి పీఠం ట్రస్టు మేనేజర్‌ జి.త్యాగరాయన్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు.

నేడు త్యాగరాజ   ఆరాధనోత్సవాలు



కంభం (అర్థవీడు), ఫిబ్రవరి 1 : ప్రముఖ వాగ్గేయకారులు, స్వరనీరాజన చక్రవర్తి త్యాగరాజ స్వా మి ఆరాధనోత్సవాలు అర్థవీడు మండలం కాకర్లలో ఈనెల 2వ తేదీ మం గళవారం జరుగుతాయని త్యాగరాజ స్వామి పీఠం ట్రస్టు మేనేజర్‌ జి.త్యాగరాయన్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. దేశవిదేశాలలో స్వర నీరాజన చక్రవర్తిగా కొలుస్తున్న త్యాగరాజు అసలు పేరు కాకర్ల త్యాగబ్రహ్మం. ఆయన పూర్వీకులు అర్థవీడు మండలం కాకర్ల గ్రామంలో నివసించేవారని స్థల పురాణం చెపుతోంది. త్యాగయ్య జన్మించడానికి ముందే వారి పూర్వీకులు తమిళనాడులోని తంజావూరుకు  వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయన వంశస్తులు వెళ్లిపోయినా త్యాగయ్య మీద ఉన్న భక్తితో కాకర్లలో  ఏటా ఫిబ్రవరిలో ఆరాధనోత్సవాలు, మేలో జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. కాకర్ల టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో సంగీత విధ్వాంసులు వచ్చి కీర్తనలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలపిస్తారని తెలిపారు. కరోనా ప్రభా వం వలన నేడు జరిగే కార్యక్రమాలకు ప్రముఖులు ఎవరూ రావడం లేదని, టీటీడీ నుంచి సంగీత విధ్వాంసులు వస్తున్నట్లు తెలిపారు. భక్తులు హాజరై జయప్రదం చేయాలన్నారు. 



Updated Date - 2021-02-02T04:50:55+05:30 IST