రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

ABN , First Publish Date - 2021-06-21T06:11:20+05:30 IST

విహారయాత్ర కోసం చీరాలకు వస్తున్న ఇరువురు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడా ్డరు. బాధితులను వైసీపీ యువ నాయకుడు కరణం వెంకటేష్‌ స్వయంగా తన కారులో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలిం చారు. ఈసంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
బాధితులతో మాట్లాడుతున్న వెంకటేష్‌


బాధితులకు కరణం వెంకటేష్‌ సాయం 

హాస్పిటల్‌కు తరలింపు


చీరాలటౌన్‌, జూన్‌20 :  విహారయాత్ర కోసం చీరాలకు వస్తున్న ఇరువురు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడా ్డరు. బాధితులను వైసీపీ యువ నాయకుడు కరణం వెంకటేష్‌ స్వయంగా తన కారులో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలిం చారు. ఈసంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.  తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన సుమారు 10మంది యువకులు వారాం తపు విహారయాత్రలో భాగంగా చీరాల వాడరేవుకు ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. కారంచేడు-చీరాల మధ్య వంతెన సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని కారు ఉమేష్‌, భూషణం ఉన్న బైక్‌ను అతివేగంగా ఢీకొంది. ఇదే స మయంలో పర్చూరు నుంచి చీరాలకు వస్తున్న  కరణం వెంకటేష్‌ వెంటనే రక్తపు మడుగులో ఉన్న వారిని స్వయంగా తన కారులో ఎక్కించి చీరాల ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు.తీవ్రంగా గాయపడిన ఉమేష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సహచరులు గుంటూరుకు తరలించారు.

Updated Date - 2021-06-21T06:11:20+05:30 IST