ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-10-20T05:51:21+05:30 IST
ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు, అక్టోబరు 19 : ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని 9వ వార్డులో టీడీపీ పట్టణాధ్యక్షుడు సయ్యద్ షా న్షావలి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల నడ్డి విరి చేం దుకు వైసీపీ చూస్తోందన్నారు. విద్యుత్ చార్జీలను పెం చడంతోపాటు వాటిపై అదనంగా ట్రూ అప్ చార్జీల పేరుతో పేదలపై భారాలు మోపు తున్నదని అశోక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బిల్లులపై వేసిన ట్రూ అప్ చార్జీల వసూ ళ్లను నిలిపివేయడంతోపాటు ఇప్ప టికే కట్టిన వారికి తిరిగి నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు స య్యద్ రహమత్‌భీ, చింతలపూరి రామలక్ష్మి, నాయకులు గోపాల్‌రెడ్డి, షేక్ మెహబూబ్‌బాషా, కొండయ్యయాదవ్, రజనిబాబు, బిల్లా రమేష్‌యాదవ్ పాల్గొన్నారు.
రాచర్లలో..
రాచర్ల : ప్రభుత్వం నిరంకుశ ధోరణి మానుకుని సాగు బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని అశోక్‌రెడ్డి అన్నారు. వి ద్యుత్ చార్జీల పెంపును, సాగు బోర్లకు మీటర్ల ఏర్పాటు చర్యలపై మంగళవారం రాత్రి గౌతవరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కటికె యోగానంద్, బీజీ నాయకులు నల్లబోతుల శ్రీనివాసరావు, అనంపల్లె నాయకులు శిరిగిరి వెంకటపతి, మార్తోటి సుబ్బారెడ్డి, చక్రి యాదవ్, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
పుల్లలచెరువులో..
పుల్లలచెరువు : పెంచిన వి ద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. మంగళవారం పెంచిన కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా మ ర్రివేముల, చాపలమడుగు, నరజాముల తాండా, మానేపల్లి నా యుడుపాలెం, పిడి కిటివారిపల్లె గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ చార్జీల పేరుతో పేదలపై భారాలు మోపుతోంద న్నారు. అనధికార కరెంట్ కోతల తో ప్రజలను, రైతులను ఇబ్బందు లకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడు పోట్ల గోవింద్, టౌన్ ప్రధాన కార్యదర్శి వేముల వీరయ్య, గ్రామ పార్టీ నాయకులు సీహెచ్.వెంకటేశ్వరెడ్డి, పీ రామిరెడ్డి, కోటేశ్వర రావు, యో గిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, యా కోబు, వెంకటేశ్వర్లు, గోపీ, బ్రహ్మం, కొండలు, కార్యకర్తలు పాల్గొన్నారు.