త్రిమూర్తులను బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-06-21T06:06:31+05:30 IST

దళితులకు వ్యతిరేక అయిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును బర్తరఫ్‌ చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు డి మాండ్‌ చేశారు. మాలమహానాడు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ వి గ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

త్రిమూర్తులను బర్తరఫ్‌ చేయాలి
నిరసన వ్యక్తం చేస్తున్న వసంతరావు

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 20 : దళితులకు వ్యతిరేక అయిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును బర్తరఫ్‌ చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు డి మాండ్‌ చేశారు. మాలమహానాడు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ వి గ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో 1996లో తోట త్రిమూర్తుల సహకా రంతో దళితులకు శిరోముండనం చేశారన్నారు. అప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలో అక్కడ చేరుతూ కేసును త ప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అటువంటి వ్యక్తికి  సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం దుర్మా ర్గంగా ఉందని, ఆయను బర్తరఫ్‌ చేయకపోతే  ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వినోద్‌, సూర య్య, అశోక్‌. నాగార్జున, బాబు, దేవసహాయం, కొండలు, బంగారయ్య, రోశయ్య, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T06:06:31+05:30 IST