ఘనంగా భగత్‌సింగ్‌ వర్దంతి

ABN , First Publish Date - 2021-03-24T06:02:33+05:30 IST

భగత్‌సింగ్‌ వర్థంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.

ఘనంగా భగత్‌సింగ్‌ వర్దంతి
రక్తదానం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

కందుకూరు, మార్చి 24: భగత్‌సింగ్‌ వర్థంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఎస్‌ఎ్‌ఫఐ పట్టణ  కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్‌సింగ్‌ వర్థంతి, రక్తదాన శిబిరాలకు జిల్లా అధ్యక్షుడు అరుణ్‌  కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా 50 మంది విద్యార్థినీ విద్యార్థులు రక్తదానం చేశారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ పట్టణ  అధ్యక్షుడు గణేష్‌, కార్యదర్శి శ్రీహర్ష, నాయకులు కిరణ్‌, అవినాష్‌, మధు, కార్తీక్‌, ఆదర్శ్‌, వేణు, హరిబాబు, సల్మాన్‌రాజు, సుమంత్‌, చందు తదితరులు పాల్గొన్నారు. 

లింగసముద్రం : భగత్‌సింగ్‌ 90వ వర్ధంతి సందర్భంగా మంగళవారం లింగసముద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ పి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ పి.బాలకోటయ్య, సర్పంచ్‌ పులి పెదరాఘవులు, ప్రిన్సిపాల్‌ పి.చెన్నారెడ్డి, నేతలు షేక్‌ షఫీ, వి కొండారెడ్డి, పి నాగేశ్వరరావు, సీహెచ్‌ రమణారెడ్డి, యన్‌ మాల్యాద్రి, బి రాఘవ తదితరులు పాల్గొన్నారు.   

పామూరు : భారత స్వాతంత్య్రం కోసం చిన్న వయస్సులోనే ఉరికంబాన్ని ముద్దాడిన వీర కిషోరం సర్ధార్‌ షాహీద్‌ భగత్‌సింగ్‌ దేశభక్తి నేటి యువతకు ఆదర్శప్రాయమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్‌డీ మౌలాలి అన్నారు. భగత్‌ సింగ్‌ 90వ వర్ధంతి  సందర్భంగా పట్టణంలోని కందుకూరు రోడ్డులోని భగత్‌సింగ్‌ విగ్రహానికి మంగళవారం సీపీఐ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వ పాలన వలన అనేక వర్గాల ప్రజలు గురౌతున్నారన్నారు.  కార్యక్రమంలో వజ్రాల సుబ్బారావు, పోతుల ప్రభాకర్‌, పాలపర్తి మస్తాన్‌రావు, ఆకుల మోహన్‌రావ్‌, ఇండ్లా నరసింహారావు, పస్రాద్‌, పి రఘునాధరెడ్డి, వెంకటరెడ్డి, తిరుపతయ్య, నారాయణ, గుత్తి రాజ తదితరులు పాల్గొన్నారు.

పీసీపల్లి : భగత్‌సింగ్‌ 90వ వర్ధంతి సందర్భంగా వివిధ పాఠశాలల్లో ఘన నివాళులు అర్పించారు. పీసీపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భగత్‌సింగ్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో గడ్డం రాంబాబు పాల్గొన్నారు. ఆయన పోరాట పటిమను, చరిత్రను విద్యార్థినీ, విద్యార్థులు వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-24T06:02:33+05:30 IST