సీఎస్‌పురంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2021-01-21T05:13:53+05:30 IST

సీఎస్‌పురంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. కారులు, ద్విచక్ర వాహ నాలు, ఆటోలు ఎక్కడబడితే అక్కడే పార్కింగ్‌ చే స్తుండంతో వాహన రాకపోకలకు అడ్డంకి ఏర్పడి ట్రాఫిక్‌ నిలిచిపోతుంది.

సీఎస్‌పురంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తం
బస్టాండ్‌ సెంటర్‌లో నడిరోడ్డుపై నిలిపిన వాహనాలు



ఎక్కడబడితే అక్కడే వాహనాల పార్కింగ్‌

సీఎస్‌పురం, జనవరి 20 : సీఎస్‌పురంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. కారులు, ద్విచక్ర వాహ నాలు, ఆటోలు ఎక్కడబడితే అక్కడే పార్కింగ్‌ చే స్తుండంతో వాహన రాకపోకలకు అడ్డంకి ఏర్పడి ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. స్థానిక మండపం సెంటర్‌ లో గతంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి వీధి వ్యాపారస్థులు వ్యాపారాలు చేసుకుంటూ ఉండే వారు. గతంలో ఇక్కడ పనిచేసిన పోలీసు అధికారి ట్రాఫిక్‌కు మీ వ్యాపారాలు అడ్డుగా ఉన్నాయని రా త్రికి రాత్రే కాలిచేయించడంతో వాల్లు చేసేదేమి లేక సెంటర్‌లోనే అక్కడక్కడా వ్యాపారాలు చే సుకుం టున్నారు. కానీ ఖాళీ చేయించిన స్థలంలో ప్రస్థుతం వాహనాలు పార్కింగ్‌ చేస్తుండడంతో మేము 20 సం వత్సరాలుగా వ్యాపారాలు చేసు కుంటూ జీవి స్తున్న ప్రాంతంలో ట్రాఫిక్‌కు అడ్డమని మమ్మల్ని ఖాళీ చేయించిన ప్రాంతం ప్రస్తుతం వాహనాల పా ర్కింగ్‌ ప్రాంతంగా ఏర్ప డి ట్రాఫిక్‌కు అడ్డంగా త యారవ్వడంపై ఆ ప్రాంతంలో గతంలో వ్యాపారాలు చేసుకుం టున్న వీధి వ్యాపార స్తులు  ఒకవిధమైన అ సహనానికి గురవు తు న్నారు.  కారులు, ఆ టోలు, సరుకుల రవా ణా వాహనాలు ఎక్కడ బడితే అక్కడే గంటల తరబడి నిలుపుదల చేస్తున్నారు. ట్రాఫిక్‌పై పోలీసుల పర్యవేక్షణ లేకపో వండంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుం టున్నారు.  డీజీపేట రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య మరీ తీవ్రంగా ఉంది. ఈ సెంటర్‌లో సిండికేట్‌ బ్యాంకు ఉండడంతో బ్యాం కుకు వచ్చిన ఖాతాదారులు తమ వాహ నాలను అడ్డదిడ్డంగా రోడ్డుపైనే పార్కింగ్‌ చేస్తుండ డంతో వాహనాల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడు తు న్నాయి. ఇదే ప్రాంతంలో ఉన్న బైక్‌ రిపే రు షాపు లు, చిన్న చిన్న వ్యాపారస్థులు దాదాపు రోడ్డుపైనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండ డంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్‌ నిలి చిపోయి వా హనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటు న్నారు. ట్రాఫిక్‌ సమస్యలపై పోలీసులు స్పం దించి ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి వాహనాలు ఎక్క డబడితే అక్కడ నిలుపుదల చేయకుండా చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




Updated Date - 2021-01-21T05:13:53+05:30 IST