వర్షాలతో నెల్లూరు వైపు నిలిచిన రాకపోకలు

ABN , First Publish Date - 2021-11-22T05:29:22+05:30 IST

రాష్ట్రం లో కురుస్తున్న భారీ వర్షాలు రవాణ వ్యవస్థపై తీ వ్ర ప్రభావం చూపింది. గత నాలుగైదు రోజులు గా కురుస్తున్న వర్షాలు కారణంగా నెల్లూరు, తిరు పతి, చిత్తూరు జిల్లాలతోపాటు చెన్నై ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వర్షాలతో నెల్లూరు వైపు నిలిచిన రాకపోకలు
ఖాళీగా ఉన్న ఒంగోలు రైల్వేస్టేషన్‌

మరో రెండు రోజులు ఇదే పరిస్థితి


ఒంగోలు(కార్పొరేషన్‌), నవంబరు 21 : రాష్ట్రం లో కురుస్తున్న భారీ వర్షాలు రవాణ వ్యవస్థపై తీ వ్ర ప్రభావం చూపింది. గత నాలుగైదు రోజులు గా కురుస్తున్న వర్షాలు కారణంగా నెల్లూరు, తిరు పతి, చిత్తూరు జిల్లాలతోపాటు చెన్నై ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వరదలు కారణం గా వాగులు, వంకలు పొంగిపొర్లడతో ఊర్లకు ఊ ళ్లు నీటమునిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు ఆయా జిల్లాలో రైల్వే వంతెనలు, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జి ల్లాను పెన్నానది రైల్వే ట్రాకుపై వరకు వరద నీ రు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించి పో యాయి. దీంతో శనివారం నుంచి నెల్లూరు, తిరుప తి, చెన్నై వైపు రైళ్లు నిలిచిపోగా, మరో రెండు రైళ్లు ఒంగోలులో ఆగాయి. కాగా ఒక రైలును తిరిగి గుంటూరు వైపు తిప్పి పంపివేయగా, తిరుపతి- పూరి ఎక్స్‌ప్రెస్‌రైలు ఆదివారం మధ్యాహ్నం వరకు ఒంగోలులోనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఒంగోలు పార్ల మెంట్‌ సభ్యులు మాగుంటశ్రీనివాసులురెడ్డి ఆహా రం, తాగునీరు అందించారు. మధ్యాహ్నం నుంచి ప్రయాణికులు ఇతర రవాణా సౌకర్యాల ద్వారా త మ ఇళ్ళకు తిరిగి వెళ్ళగా, ఒంగోలు రైల్వేస్టేషన్‌ ని ర్మానుష్యంగా మారింది. ఇదిలా ఉండగా, తిరుపతి, బెంగుళూరు, నెల్లూరు వైపు బస్సులను శనివారం పూర్తిగా ఆపివేయగా, ఆదివారం నాటికి జాతీయ రహదారిపై వరద నీరు తగ్గుముఖం పట్టడంతో యాభైశాతం బస్సులను నడిపారు. అయితే ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు ఉండవచ్చ ని రైల్వే, ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో రవాణ వ్యవస్థ మెరుగుపడేంత వరకు విజయవాడ వైపు రైళ్లు ఒంగోలు వరకు మాత్రమే వచ్చి వెళుతుండగా, ఆర్టీసీ మాత్రం అరకొర బస్సు లను ఏర్పాటు చేసి, ప్రయాణికులకు కొంత ఇబ్బం దులు లేకుండా చర్యలు చేపట్టింది. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తుండగా, బస్టా ండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసోయింది. మరోవైపు నెల్లూరు, చెన్నై, బెంగళూరు, తిరుపతిలకు పూర్తి గా రైళ్లు నిలిపివేయడంతో ఒంగోలు రైల్వేస్టేషన్‌ ని ర్మానుష్యంగా మారిపోయంది. తుఫాను ప్రభావం రవాణ వ్యవస్థపై తీవ్రంగా పడింది.


Updated Date - 2021-11-22T05:29:22+05:30 IST