పొదిలిలో ట్రాఫిక్ అస్తవ్యస్తం
ABN , First Publish Date - 2021-12-26T05:32:18+05:30 IST
పొదిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

పొదిలి, డిసెంబరు 25 : పొదిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పొదిలి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అ యిన ప్పటికీ ఆదిశగా మౌలిక వసతులు గానీ, రోడ్డు విస్తరణ పనులు గానీ చేపట్టలేదు. దీం తో ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాల రద్దీ త్రీ వంగా ఉంటోంది. పట్టణంలోని ప్రధాని కూ డలి, పెద్ద బస్టాండ్, చిన్నబస్టాండ్, విశ్వనా థపురం సెంటర్లలో ఎక్కువసార్లు ట్రాపిక్ అంత రాయం ఏర్పడి వాహనాలు గంటల స మ యం నిలిచిపోతున్నాయి. ఇందుకు ప్రధా ణం పొదిలి జిల్లాకు నడికూడలి కావడంతో ప్రధాన పట్టణాలతో పాటు పలు పుణ్యక్షేత్రా లకు పొదిలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప ట్టణంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ. చిన్న బస్టాండ్ నుంచి పెద్దబస్టాండ్ వరకు వ్యా పార సముదాయాలుండడంతో సరుకు నిల్వలు దించేందుకు వాహనాలను నిలిపి ఉంచుతారు. ఈ సమయంలో రెండు వైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సు దూరప్రాంతాల నుంచి భారీ వాహనాలు పొది లి మీదుగా ప్రయాణిస్తుంటాయి. దీంతో వాహ నాల రద్దీ కూడా ఎక్కువే. భారీ వాహనాలు వెళ్లే క్రమంలో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. మరోపక్క రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్ వ్యాపారులు, పండ్ల బండ్ల దుకా ణాలు నిర్వహిస్తుంటారు. వారు యథేచ్ఛగా రోడ్డుమీదే బళ్లు నిలిపి వ్యాపారం సాగిస్తుం డడంతో ఇబ్బందిగా మారింది. తాలుకా ఆఫీస్ వీధి, మాయాబజారు, విశ్వనాథపురం, కాలేజీ రో డ్డులో సాయంత్రం వేళలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా విశ్వనాథపురం కాలేజీ రోడ్డులో అనేక విద్యా సంస్థలు, దుకాణ స ముదాయాలు ఉండడంతో ఈ ప్రాంతంలో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్ప డుతోంది. పలుచోట్ల దుకాణాలకు వచ్చే వాహ నాలకు పార్కింగ్ సదుపాయం లేదు. దీంతో కొనుగోలుకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలపడంతో ఇతర వా హనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. గతంలో పోలీసులు 15రోజుల కో సారి రోడ్డుకు ఎడమవైపున కొన్నిరోజులు, కుడి వైపున కొన్ని రోజులు వాహనాలు పార్క్ చే యాలని సూచించినా ఎవరూ పాటించడం లేదు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతు న్నారు.