టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతల అరెస్టు అన్యాయం

ABN , First Publish Date - 2021-01-27T06:01:32+05:30 IST

విద్యార్ధుల భవిష్యత్‌తో ఆడు కుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.77ను రద్దు చేయాలని కోరిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఒం గోలులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతల అరెస్టు అన్యాయం
టీడీపీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న నాయకులు

ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 26 : విద్యార్ధుల భవిష్యత్‌తో ఆడు కుంటున్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.77ను రద్దు చేయాలని కోరిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఒం గోలులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ నియోజవకర్గ అధ్యక్షుడు టి.రవితేజ, ప్రధాన కా ర్యదర్శి గౌస్‌బాషా మాట్లాడుతూ జీవో నెం. 77 ద్వారా పేద, బడుగు, బల హీన వర్గాల విద్యార్థులు పీజీ విద్యకు దూరం అయ్యే పరిస్థితి నెలకొం దన్నారు.  వెంటనే ప్రణవ్‌గోపాల్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో నాయకులు మంచు లలిత్‌ కుమార్‌, అజీమున్‌, అలుగుబెల్లి శివ, సిద్ధిక్‌, కల్లూరి మోహన్‌సాయి, మామిళ్ళ రేవంత్‌, దినేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T06:01:32+05:30 IST