ఈదుమూడి టీచర్‌కు అరుదైన అవకాశం

ABN , First Publish Date - 2021-10-22T05:27:37+05:30 IST

ఈదుమూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్సు స్కూలు అసిస్టెంటుగా పని చేస్తున్న కాకి స్వర్ణలతకు అరుదైన అ వకాశం లభించింది. వచ్చే విద్యాసంవత్సరంలో మారను న్న 8వ తరగతి పాఠ్యపుస్తకాలను సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా రూపొందించేందుకు ఫిజికల్‌సైన్సు పాఠ్య పుస్తక రచనకు స్వర్ణలతను ఎంపిక చేస్తూ ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్‌ బి.ప్రతాపరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈదుమూడి టీచర్‌కు అరుదైన అవకాశం
కాకి స్వర్ణలత

ఒంగోలువిద్య, అక్టోబరు 21 : ఈదుమూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్సు స్కూలు అసిస్టెంటుగా పని చేస్తున్న కాకి స్వర్ణలతకు అరుదైన అ వకాశం లభించింది. వచ్చే విద్యాసంవత్సరంలో మారను న్న 8వ తరగతి పాఠ్యపుస్తకాలను సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా రూపొందించేందుకు ఫిజికల్‌సైన్సు పాఠ్య పుస్తక రచనకు స్వర్ణలతను ఎంపిక చేస్తూ ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్‌ బి.ప్రతాపరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ఇన్‌స్పెయిర్‌లలో ఆమె ప్రథమ బహుమతులు సాధించా రు. వివిధ సేవా సంస్థలలో కూడా స్వర్ణలత పలు అవార్డులు, రివార్డులు పొం దారు. నూతన పాఠ్యపుస్తక రచనకు ఎంపికైన స్వర్ణలతను పాఠశాల విద్య గుం టూరు ఆర్‌జేడీ వీఎస్‌.సుబ్బారావు, డీఈవో బి.విజయభాస్కర్‌, పాఠశాల ఉపాధ్యా యులు గురువారం అభినందించారు. 


Updated Date - 2021-10-22T05:27:37+05:30 IST