రైతుల పోరాట ఫలితంతోనే బిల్లు ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-11-23T06:02:29+05:30 IST

అమరావతి రైతుల 700 రోజులుగా చేస్తున్న పోరాట ఫలితంగానే మూడు రాజధానులు సీఆర్‌డీఏ బిల్లులు రద్ధయ్యాయని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.

రైతుల పోరాట ఫలితంతోనే బిల్లు ఉపసంహరణ
బాణాసంచా కాలుస్తున్న టీడీపీ నాయకులు

కనిగిరి, నవంబరు 22: అమరావతి రైతుల 700 రోజులుగా చేస్తున్న పోరాట ఫలితంగానే మూడు రాజధానులు సీఆర్‌డీఏ బిల్లులు రద్ధయ్యాయని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లును కోర్టులో ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ మేరకు పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం చేసిన త్యాగం వృథాగా పోదన్నారు. ఇది అమరావతి రైతుల విజయంగా అభివర్ణించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలన్నారు.  రాజధాని కోసం అన్నాహారాలు మానేసి నిరాహర దీక్షలు చేసిన రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులుగా విమర్శించిన వారికి ఇది ఒక గుణపాఠంగా గుర్తించుకోవాలన్నారు. ముందుగా టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ శ్రేణులు, నాయకులు పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ సుగుణావతమ్మ సెంటర్‌, నగరికంటి బసవయ్య సెంటర్‌, ఒంగోలు బస్టాండ్‌ సెంటర్‌, పామూరు బస్టాండ్‌ సెంటర్‌లలో బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రోషన్‌ సందాని, గుడిపాటి ఖాదర్‌, రిజ్వాన్‌, రామకృష్ణ, తెలుగు యువత నాయకులు ఫిరోజ్‌, షడ్రక్‌, గౌడ్‌, నరసింహా, మధు, దేవా, షబ్బీర్‌, పాలూరి సత్యం, మోజేష్‌, కరాటే యాసిన్‌, సుబాని, శ్రీరాములు యాదవ్‌, జయరావు, రాజా, సుబ్బయ్య, షఫీ, దానియేలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T06:02:29+05:30 IST