రంగోత్సవ్ పోటీల విజేతలు వీరే..
ABN , First Publish Date - 2021-12-31T04:47:52+05:30 IST
పాఠశాల విద్యాశాఖ, ఎస్‌ఈఆర్టీల ఆధ్వర్యంలో గురువారం మైనంపాడులోని డైట్‌లో జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు నిర్వహించారు. డైట్ ప్రధానాచార్యులు టి. వెంకటేశ్వర్లు ఈ పోటీలు పర్యవేక్షించారు. విజే తలకు డైట్ అధ్యాపకుడు ఎ.కిరణ్‌కుమార్ నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఒంగోలువిద్య, డిసెంబరు 30 : పాఠశాల విద్యాశాఖ, ఎస్‌ఈఆర్టీల ఆధ్వర్యంలో గురువారం మైనంపాడులోని డైట్‌లో జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు నిర్వహించారు. డైట్ ప్రధానాచార్యులు టి. వెంకటేశ్వర్లు ఈ పోటీలు పర్యవేక్షించారు. విజే తలకు డైట్ అధ్యాపకుడు ఎ.కిరణ్‌కుమార్ నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రఽథమ బహుమతి సాధించిన నలుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కలరింగ్ పోటీ లో షేక్ బుజ్జి (మైనంపాడు), హ్యాండ్‌రైటింగ్ పోటీలో ఎన్.సంజన (దేవరపాలెం), కార్టూన్ మేకింగ్‌లో జె.భానుష (దర్శి), గ్రీటింగ్‌కార్డు మేకింగ్ పోటీలో వి.శ్రీలత (దర్శి) రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాలని ప్రి న్సిపాల్ ఆదేశించారు. న్యాయనిర్ణేతలుగా ఆర్.శ్రీనివాసులు, టి.బాలాజీ, కె.శ్రీనివాసులు, జిల్లా కోఆర్డినేటర్ గా ఎం.రవింద్రప్రసాద్, బి.బిక్షాలు వ్యవహరించారు.