మహిళా శిశు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-09-02T06:50:56+05:30 IST

రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమమే లక్ష్యంగా సీఎం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మహిళా శిశు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఒంగోలులో పౌష్టికాహార వారోత్సవాలను ప్రారంభిస్తున్న మంత్రి బాలినేని

మంత్రి బాలినేని 

ఒంగోలు (జడ్పీ), సెప్టెంబరు 1 : రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమమే లక్ష్యంగా సీఎం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద జాతీయ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా జరిగిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు బుధవారం నుంచి ఈనెల 7వతేదీ వరకు వారంరోజుల పాటు అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జేసీ టి.ఎస్‌.చేతన్‌, మహిళాశిశు సంక్షేమ శాఖ పీడీ లక్ష్మీదేవి, జడ్పీ సీఈవో దేవానందరెడ్డి, నగర మేయర్‌ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-02T06:50:56+05:30 IST