మధురమైన భాష తెలుగు

ABN , First Publish Date - 2021-12-27T05:28:22+05:30 IST

ప్రపంచంలో మధురమైన భాష తెలుగు అని ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్‌ శ్రిస్టి చంద్ర మౌళి శర్శ చెప్పారు.

మధురమైన భాష తెలుగు
డాక్టర్‌ కడిమిళ్ల వరప్రసాద్‌ను సత్కరిస్తున్న డాక్టర్‌ స్వర్ణ వెంకటేశ్వరరావు

 ప్రముఖ కవి డాక్టర్‌ చంద్రమౌళి శర్శ

సింగరాయకొండ, డిసెంబరు 26: ప్రపంచంలో మధురమైన భాష తెలుగు అని ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్‌ శ్రిస్టి చంద్ర మౌళి శర్శ చెప్పారు. స్థానిక ఏఆర్‌సీ అండ్‌ జీవీఆర్‌ ఉన్నత పాఠశా లలో ఆదివారం స్వర్ణ సాహితీ సమితి ఆధ్వర్యంలో డాక్టర్‌ స్వర్ణ వెం కటేశ్వరరావు అధ్యక్షతన స్వర్గీయ స్వర్ణ నరసింహ- సుబ్బమ్మ స్మారక ఉత్తమ కావ్యరచనా పురస్కార సభలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు.  పద్యం, అష్టావధానం తెలుగువాడి సొత్తని  అ న్నారు.  పద్య కావ్యరచనా పురస్కారాల్లో ఉత్తమ పద్యకావ్యంగా డాక్ట ర్‌ కడిమిళ్ల వరప్రసాద్‌ రచించిన గోభాగవతం ఎంపికకాగా, రచ యితకు రూ. 5,116 నగదు బహుమతిని అందజేశారు. ద్వితీయ పద్య కావ్యంగా ప్రసన్న కవి ఉన్నం జ్యోతివాసు రచించిన నేనొకపూలరెమ్మ నై ఎంపికకాగా, రచయితకు 2,116 నగదు బహుమతిని అందజేశారు.

వచనా కావ్య రచనా పురస్కారాల్లో ఉత్తమ వచన కావ్యంగా చి త్తూరు జిల్లా కుప్పంకు చెందిన పల్లిపట్టు నాగరాజు రచించిన యాలై పూడ్చింది, ద్వీతీయ కావ్యంగా హైదరాబాద్‌కు చెందిన కోరుప్రోలు మాధవరావు రచించిన మాధవ మంజరి ఎంపికయ్యాయి. పురస్కార గ్రహీతలకు స్వర్ణ సాహితీ సమితి ఆధ్వర్యంలో నగదు పురస్కారా లను అందజేయడంతో పాటు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు.  కవులను ప్రోత్సహిస్తూ తెలుగు భాషా ఉన్నతికి కృషిచేస్తున్న సమితి నిర్వాహకులు డాక్టర్‌ స్వర్ణ వెంకటేశ్వరరావుని ఈ సందర్భంగా అభినం దించారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితివేత్తలు డాక్టర్‌ నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్‌ బొట్లగుంట కోటయ్య, తన్నీరు బాలాజీ,  దుపాటి రామాచార్యులు, నాగకుమారిశర్శ, ఈశ్వరీ గోపాల్‌రావు, జ్యోతి ర్మయ, చిలకపాటి సుధాకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T05:28:22+05:30 IST