రాష్ట్ర రాజధాని అమరావతి

ABN , First Publish Date - 2021-12-16T04:28:59+05:30 IST

ఒకే రాష్ట్రం, ఒకేరాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుం టు న్నారని అది అవరావతి రైతుల పాదయాత్రతో రుజు వైందని టీడీపీ సీనియర్‌ నేత, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర అన్నారు.

రాష్ట్ర రాజధాని అమరావతి
ముగిసిన అమరావతి పాదయాత్రకు సంఘీభావంగా వైపాలెంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్న డాక్టర్‌ మన్నె రవీంద్ర, టీడీపీ నాయకులు, రైతు సంఘం నాయకులు

మహాపాదయాత్రతో అది రుజువైంది

అందరి మద్దతుతో దిగ్విజయంగా 

తిరుపతికి చేరిన రైతులు

విజయోత్సవ ర్యాలీలో డాక్టర్‌ మన్నె 

టీడీపీ ఆధ్వర్యంలో 

సంఘీభావ  కార్యక్రమాలు

అమరావతి రైతులకు 

అభినందనలు తెలిపిన శ్రేణులు

ఎర్రగొండపాలెం, డిసెంబరు 15 : ఒకే రాష్ట్రం, ఒకేరాజధానిగా అమరావతిని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుం టు న్నారని అది అవరావతి రైతుల పాదయాత్రతో రుజు వైందని టీడీపీ సీనియర్‌ నేత, జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మన్నె రవీంద్ర అన్నారు. అమరావతి మహా పాద యాత్ర విజయవంతం అయిన సందర్భంగా బుధవారం వైపాలెంలో విజయోత్సవ ర్యాలీని నిర్వ హించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మన్నె మాట్లాడుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు సా గించిన పాదయాత్రకు అడుగడునా ప్రజలు, పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతోపాటు దేశవ్యా ప్తంగా అభిమానులు మద్దతు పలికారని తెలిపారు. ఇది చూసైనా వైసీపీ పాలకులు కళ్లు తెరవాలన్నారు. వెంటనే అమరావతి రాజధానిగా అభివృద్ధిని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్‌లో ఉన్న మహనీయుల విగ్రహాలకు పూలమాలలువేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, వూట్ల సీతారామయ్య, పయ్యావుల ప్రసాద్‌, వి.వెంకటరెడ్డి, మాజీ  జడ్పీటీసీ మంత్రునాయక్‌, రాష ్ట్రరైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, జిల్లా కార్యదర్శి డి శ్రీనివాస్‌, మాజీ సర్పంచి కంచర్ల సత్యనారాయణగౌడ్‌, ఎం పీటీసీ సభ్యుడు గుమ్మా  ఎల్లయ్య, షేక్‌ ఇ స్మాయిల్‌, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు కొత్తమాసు సుబ్రమణ్యం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు షేక్‌ రఫీ, మం డల కార్యదర్శి జి.కనకారావు, బోయలపల్లి టీడీపీ అధ్య క్షుడు పి.వెంకటకోటయ్య, టీడీపీ మాజీ మండల అధ్య క్షుడు శనగా నారాయణరెడ్డి, వెన్నా వెంకిరెడ్డి, నారాయణరెడ్డి, రామకృష్ణ, కొత్త భాస్కర్‌, కోటా డేవిడ్‌ టీడీపీ ము ఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

గిద్దలూరులో సంఘీభావం 

గిద్దలూరు : ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కోసం సాగిన అమరావతి రైతుల మహాపాదయాత్ర విజయవంతమైన సందర్భంగా టీడీపీ నాయకులు సంఘీభావం ప్రక టించారు.  అమరావతి రైతులకు  మాజీ ఎమ్మెల్యే ము త్తుముల అశోక్‌రెడ్డి నివాస గృహంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు అభినందనలు తెలిపారు. పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి మాట్లాడుతూ రా ష్ట్రంలోని అన్ని జిల్లాలకు అందుబాటులో ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రా జధాని రైతులు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందనను చూసైనా పాలకులకు బుద్ధి రావాలన్నారు.  ఇప్పటికైనా అమరావతి రాజధానిగా అభి వృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు.  కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, పట్టణశాఖ మాజీ అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌, తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిళ్లపల్లి కిశోర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బి.చంద్రశేఖర్‌యాదవ్‌,  నాయకులు రజనిబాబు, అన్నోజీరావు, గుర్రం డానియేలు, మోపూరి పుల్ల య్య, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు బి.రాఘవేంద్రయాదవ్‌, జిల్లా కార్యదర్శి షరీఫ్‌,  ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి దూదేకుల దస్తగిరి పాల్గొన్నారు.



Updated Date - 2021-12-16T04:28:59+05:30 IST