మూట నారు రూ.4వేలు

ABN , First Publish Date - 2021-12-29T04:55:25+05:30 IST

దక్షిణాదిలో పొగాకు రైతాంగా న్ని గత నెలలో ముసురుపట్టి కురిసిన వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి.

మూట నారు రూ.4వేలు
ఒంగోలు మండలం దశరాజుపల్లి పొలాల్లో పోగాకు నాట్లు వేస్తున్న కూలీలు

 వర్షాల అనంతరం రెట్టింపు ధర

పొగాకు రైతులకు అదనపు భారం

ముందస్తు పంటలో తగ్గుతున్న నాణ్యత

ఒంగోలు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలో పొగాకు రైతాంగా న్ని గత నెలలో ముసురుపట్టి కురిసిన వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. చాలాప్రాంతాల్లో వేలాది ఎకరాలలో పొగాకు తోటలు దెబ్బతిన్నాయి. అం తకుమించి ముమ్మరంగా పొగాకు నాట్లు జరిగే సమయంలో తెరపి లేకుం డా వర్షాలు కురవడంతో తీవ్రజాప్యం జరిగింది. ప్రస్తుతం దెబ్బతిన్న తోట లు తిరిగి దున్ని మళ్ళీ నాట్లు వేస్తుండగా పాక్షికంగా దెబ్బతిన్న తోటలలో ఇడుపులు వేస్తున్నారు. మరోవైపు వర్షాలతో నాట్లు వేసే అవకాశం లేకుం డా పోయినా పొలాల్లో నాట్లు వేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా పొగాకు నారుకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో సాధారణం కన్నా రెట్టింపు ధర పలుకుతోంది. గతంలో మూట నారు తొలుత రూ.వెయ్యి తర్వాత రూ. 1500 నుంచి రూ.1800 వరకు ధర ఉండగా ప్రస్తుతం వారం పదిరోజుల నుంచి మూట నారు రూ.4వేలు పలుకుతోంది. అది కూడా జిల్లాలో అంత నాణ్యమైనది దొరక్క రైతులు అనేక మంది రాజమండ్రి పరిసర ప్రాంతా లకు వెళ్లి తె చ్చుకుంటున్నారు. అందులోనూ కొంత నారు పనికిరాక పొలం వద్దకు తెచ్చాక గ్రేడ్‌ చేసుకోవాల్సి వస్తోంది. పొగాకు బోర్డు 2021-22 సంవత్సరానికి దక్షిణాదిలోని రెండు రీజియన్లు పరిధిలో మొత్తం 50వేల హెక్టార్లలో పంట సాగుకు అనుమతి ఇచ్చింది. అందులో గత నెలలో వ ర్షాలు కురిసేనాటికి 29వేలకుపైగా హెక్టార్లలో నాట్లు వేశారు. మరో 20 వేల హెక్టార్లలో నాట్లు వేసేందుకు భూములు దున్ని సిద్ధం చేశారు. కాగా వర్షాలతో 6వేలకుపైగా హెక్టార్లలో కొంత పాకిక్షంగా, మరికొంత పూర్తిగా మొక్కలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో పంట దెబ్బతిన్న భూములతో పాటు మిగిలిన విస్తీర్ణంలో పదిరోజులుగా ముమ్మరంగా నాట్లు వేస్తున్నా రు. అలా ప్రస్తుతానికి సుమారు 33వేల హెక్టార్లలో నాట్లు పూర్తయినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నాట్లు వేస్తున్న రైతులకు అందుతున్న సమాచారం మేరకు హెక్టారుకు దాదాపు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు అదనపు ఖర్చు అవుతోంది.

ఖర్చు తడిసిమోపెడు

కొన్నిచోట్ల దెబ్బతిన్న పంటను దున్నేసి మళ్ళీ వేస్తుండగా అసలు పంటలేయని పొలంలో కూడా కలుపు మొక్కలు పెరగడంతో మళ్ళీ దున్ని వేయాల్సిన పరిస్థితి. దీంతో వర్షాలు అనంతరం రెండు సార్లు గొర్రు, రెండుసార్లు అచ్చు తొలకం తప్పట్లేదు. దాని వల్ల హెక్టారుకు సగటున రూ.5వేల ఖర్చవుతోది. అలాగే  ఎరువులకు మరో రూ.5వేలు అవుతుండ గా నారు ధర భారీగా పెరగడంతో ఖర్చు తడిసి మోపెడవుతోది. హెక్టా రుకు 5 మూటల నారు అవసరం కాగా మూట రూ.4వేలు పలుకుతుం డటంతో హెక్టారుకు రూ. 20వేల వరకు అవుతోంది. ఇక నాట్లు వేసే కూలీలు, నీటి సరఫరాకు రూ.7వేల నుంచి రూ.8వేల వరకు అవుతోంది. అలా ప్రస్తుతం రైతులు అదనంగా హెక్టారుకు రూ.30వేల నుంచి రూ.35 వేలు ఖర్చుచేయాల్సి వచ్చి ఆందోళన పడుతున్నారు. 

తగ్గుతున్న నాణ్యత

వర్షాలు కారణంగా ముందుగా వేసిన తోటలు దెబ్బతిని ఎర్రగా పోవడంతో ప్రస్తుతం ఆకు కొట్టుడు ప్రారంభించిన చోట నాణ్యత లేని పొగాకు దిగుతున్నట్లు సమాచారం. ఎంతో  కొంత దిగుబడి పెంచాలన్న తాపత్రయంతో పలు ప్రాంతాల రైతులు నీటి తడులు పెట్టే ప్రయత్నంలో ఉండగా హెక్టారుకు రూ.10వేలకుపైగా అందుకోసం ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇక ప్రస్తుతం వేస్తున్న తోటలకు కూడా కనీసం రెండుసార్లు నీటి తడులు తప్పదని చెప్తున్నారు. మొత్తంగా ఆ వర్షాలు రైతులను తీర వంగా దెబ్బతీయడమే కాక పంట సాగులో అదనపు భారాన్ని మోపుతున్నాయి. 

ఏడు ఎకరాల్లో మళ్ళీ నాట్లు వేసా

- వడ్డెళ్ళ వరప్రసాద్‌, పొగాకు రైతు నాయకుడు

ఏటా పొగాకు సాగుతో పోల్చితే ఈ ఏడాది కష్టాలు అధికంగా ఉన్నా యి. 37 ఎకరాల్లో పంట సాగు చేపట్టా. వర్షాలతో ఏడు ఎకరాలు పూర్తిగా దెబ్బతింది. మొత్తం దున్నేసి మళ్ళీ నాట్లు వేశా. మూట నారు రూ 4 వేలకు కొని తెచ్చా. సేద్యం, ఎరువులు అదనం. దాంతో ఎకరాకు రూ. 14వేలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మిగిలిన విస్తీర్ణంలోనూ దా దాపు 25శాతం మొక్కలు దెబ్బతిన్నాయి. వాటిలో ఇడుపులు వేయించా. ఉన్న మొక్కలు కూడా ఎర్రబారి ఉండటంతో ఎదుగుదల లోపించింది. ది గుబడి సగానికి సగం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. 

Updated Date - 2021-12-29T04:55:25+05:30 IST