రెండో ప్రపంచయుద్ధంలో సైనికుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , First Publish Date - 2021-10-30T05:25:17+05:30 IST
రెండో ప్రపంచయుద్ధంలో దేశ సైనికుల పోరాటాలు చిరస్మరణీయమని జిల్లా సైనిక సంక్షేమశాఖాధికారి రజినీకుమారి పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయంలో శుక్రవారం రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న జిల్లాకు చెందిన మాజీ సైనికుల భార్యలను ఆజాదీ అమృత్సోవ్‌లో భాగంగా ఘనంగా సత్కరించారు.
ఒంగోలు(రూరల్), అక్టోబరు 29: రెండో ప్రపంచయుద్ధంలో దేశ సైనికుల పోరాటాలు చిరస్మరణీయమని జిల్లా సైనిక సంక్షేమశాఖాధికారి రజినీకుమారి పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయంలో శుక్రవారం రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న జిల్లాకు చెందిన మాజీ సైనికుల భార్యలను ఆజాదీ అమృత్సోవ్‌లో భాగంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రజినీ కుమారి మాట్లాడుతూ రెండో ప్రపంచయుద్ధంలో అసువులు బాసిన సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.5వేలు పింఛను ఇస్తుందన్నారు. కార్య క్రమంలో రాష్ట్ర మాజీ సైనికుల జేఏసీ అధ్యక్షుడు నెప్పల నాగేశ్వరరావు, క్యాం టీన్ మేనేజర్ వెంకట్రావు, ఉద్యోగ కల్పనాధికారి ఇందిరాదేవి పాల్గొన్నారు.