ఇబ్బందులు లేకుండా క్వారీలను నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-10-29T04:58:06+05:30 IST

ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్రానైట్‌ క్వారీల పనులను నిర్వహించుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి తెలిపారు.

ఇబ్బందులు లేకుండా క్వారీలను నిర్వహించాలి

రెండు గ్రామాలలో ప్రజాభిప్రాయ సేకరణ  


బల్లికురవ, అక్టోబరు 28 : ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్రానైట్‌ క్వారీల పనులను నిర్వహించుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి తెలిపారు. గురువారం బల్లికురవ మండలంలోని మల్లాయపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో హనుమాన్‌ఎక్స్‌పోర్ట్సు, సౌధామి ని గ్రానైట్‌ క్వారీల ఏర్పాటుకు ఎన్‌వోసీ దరఖాస్తు మంజూరు కాగా ప ర్యావరణ అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి పర్యవేక్షణలో చేపట్టారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతు గ్రానైట్‌ క్వారీలకు పూర్తి స్థాయి అనుమతులు వచ్చాకే పనులు చేపట్టాలని, దుమ్ము లేవకుండా క్వారీల వద్ద రోజూ నీటిని చల్లించాలని నిర్వాహకులకు సూచించారు. నిబందనల మేరకు ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే క్వారీయింగ్‌ చేపట్టాలని ఆయన కోరారు. ఈ స ందర్భంగా ప్రజలు క్వారీలు పెట్టుకొనేందుకు తమకు అభ్యంతరాలు లే వని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ ఈ ఈ నాగిరెడ్డి, కన్సల్టెంట్‌ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్‌ అశోక్‌వర్దన్‌, క్వారీ యజమానులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-29T04:58:06+05:30 IST