గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2021-10-31T07:26:15+05:30 IST

తెలుగుదేశంపార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంగా కృషి చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొల్లా మాల్యాద్రి చౌదరిలు సూచించారు.

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

పామూరు, అక్టోబరు 30: తెలుగుదేశంపార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంగా కృషి చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొల్లా మాల్యాద్రి చౌదరిలు సూచించారు. మండలంలోని వగ్గంపల్లి గ్రామంలో గ్రామ కమిటీ ఎంపిక శనివారం నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా భైరెడ్డి నాగార్జునరెడ్డి, ఉపాధ్యక్షుడిగా చావా.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా డేగా నాగరాజును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో ఎం.హుస్సేన్‌రావు యాదవ్‌, భైరెడ్డి జయరామిరెడ్డి, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, మన్నం రమణయ్య, ఇర్రి కోటిరెడ్డి, డోలా.శేషాద్రి, భైరెడ్డి కొండారెడ్డి, రెక్కల వెంకట రమణారెడ్డి, చంద్రశేఖర్‌, రామకృష్ణ, పి.వెంకటేశ్వర్లు, భైరెడ్డి కొండారెడ్డి, ఉప్పుగండ్ల రమేష్‌, ఎం.రాజారావు, కె శ్రీనివాసులరెడ్డి, శ్రీరాం నాగార్జున, సురేష్‌, కే.వెంకటయ్య, టి.తిరుపాలు, షేక్‌ రఫీ, సీహెచ్‌ సుధీర్‌, భైరెడ్డి జశ్వంత్‌, టి జాన్‌, కె రమణయ్య, పి భాస్కర్‌, ఆర్‌ సుబ్బారెడ్డి, ముక్కు తిరుపతయ్య, సీహెచ్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-31T07:26:15+05:30 IST