దూషించాడని యువకుడి హత్య

ABN , First Publish Date - 2021-12-27T05:17:49+05:30 IST

మద్యం మత్తులో స్నేహితుడే తన కుటుంబ సభ్యులను దూషించాడని కూకట్లపల్లికి చెందిన పల్లెల రామకృష్ణారెడ్డి (27) అనే యువకుడిని శనివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు దారుణంగా హత్య చేశారు.

దూషించాడని యువకుడి హత్య
హత్యకు గురైన రామకృష్ణారెడ్డి

కూకట్లపల్లిలో దారుణం 

ఇరువురు యువకులపై 

కేసు నమోదు, అరెస్టు

బల్లికురవ, డిసెంబరు 26: మద్యం మత్తులో స్నేహితుడే తన కుటుంబ సభ్యులను దూషించాడని కూకట్లపల్లికి చెందిన పల్లెల రామకృష్ణారెడ్డి (27) అనే యువకుడిని శనివారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు దారుణంగా హత్య చేశారు. ఎ్‌సఐ వేమన క థనం ప్రకారం కూకట్లపల్లి గ్రామానికి చెందిన పల్లెల రామకృష్ణారెడ్డి, యి ప్పల వీరాంజిరెడ్డి, గుడిపాటి అజేందర్‌రెడ్డి ముగ్గురూ స్నేహితులు.  శనివారం గ్రామంలో ఫూటుగా మద్యం సేవించారు. అనంతరం గ్రామ సెంటర్‌లోకి వచ్చిన తరువాత మత్తులో అజేందర్‌రెడ్డి తల్లిని, అక్కను రామకృష్ణారెడ్డి దుర్భాషలాడాడు. ఎందుకు తిడుతున్నావని అజేందర్‌రెడ్డి ప్రశ్నించగా ఇంకా పెద్దగా తిట్టటంతో తీవ్ర ఆగ్రహావేశానికిలోనైన అజేందర్‌రెడ్డి ఎలాగైనా రామకృష్ణారెడ్డిని మట్టుబెట్టాలని పథకం వేశాడు.  ఆ వెంటనే ఇంటికి వెళ్లి కత్తి తీసుకు వచ్చి సెంటర్‌లో ఉన్న  రామకృష్ణారెడ్డితో మాములుగా మాట్లాడాడు. ఒంగోలు వెళదాం అంటూ మరో స్నేహితుడు వీరాంజిరెడ్డితో కలిసి బైక్‌ ఎక్కించుకొని గొర్రెపాడు- నార్కెట్‌పల్లి రోడ్డు జంక్షన్‌ వద్దకు రాత్రి 11 గంటలకు తీసుకువెళ్లాడు. మఽధ్యలో మూత్ర విసర్జనకు అని బైకు దింపి రామకృష్టారెడ్డిని కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులు ఇరువురూ తాము వచ్చిన బైకును అక్కడే వదిలి వెళ్లారు. హత్య జరిగిన విషయం తెలిసిన వెంటనే అద్దంకి సీఐ రాజేష్‌, బల్లికురవ ఎస్‌ఐ వేమన సంఘటనా స్థలాన్ని  పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి అన్న శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఇరువురు యువకులపై కేసు నమోదు చేశారు. నిందితులను ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

  కబడ్డీ విజేత విజయవాడ జట్టు

పంగులూరు, డిసెంబరు 26: పంగులూరు మండలం కొండముంజులూరు లో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విజయవాడ జట్టు విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన పోటీలలో విజయవాడ జట్టు  ప్రథమ స్థానంలో నిలువగా, చినగంజాం జట్టు రెండో స్థానం, ఆరేపల్లి ముప్పాళ్ళ  జ ట్టు మూడో స్థానం, వినోదరాయునిపాలెం జట్టు నాలుగో స్థానం కైవసం చేసుకున్నాయి. అద్దంకి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గరటయ్య విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు మందా పురుషోత్తం, గ్రామ సర్పంచ్‌ చొప్పరపు ప్రభాకర్‌, ఏఎంసీ మాజీ చైౖర్మన్‌ జంపని రవిబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-27T05:17:49+05:30 IST