అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దారవీడు మం డలం దేవరాజుగట్టు హైవేపై శుక్రవారం జరి గింది.

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ కిషోర్‌కుమార్‌

పెద్దారవీడు(మార్కాపురం వన్‌టౌన్‌), డి సెంబరు 25 : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దారవీడు మం డలం దేవరాజుగట్టు హైవేపై శుక్రవారం జరి గింది. ఈ సంఘటనలో దేవరాజుగట్టుకు చెం దిన బట్టగిరి సంజీవరెడ్డి(35) మృతి చెందా డు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రి సంజీవరెడ్డి బందువుల దగ్గర డబ్బులు తీ సుకొని వస్తానని గురువారం  రాత్రి ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు సంజీవరెడ్డికి ఫో న్‌ చేయడంతో వస్తున్నానని చెప్పాడు. శుక్రవారం తెల్లవారుజామున దేవ రాజుగట్టు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద రోడ్డుపై సంజీవరెడ్డి ద్విచక్రవాహనంతో గా యాలతో మృతి చెంది ఉన్నాడు.  ఈ మరణంపై కుటుంబ సభ్యులు, బం ధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ కిషోర్‌కుమార్‌,  సీఐ ఆంజనేయరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పెద్దారవీడు ఎస్‌ఐ పి.రాజేష్‌ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించారు.


Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST