మహమ్మద్ ప్రవక్త జీవితం ఆదర్శప్రాయం
ABN , First Publish Date - 2021-10-17T05:37:48+05:30 IST
ప్రపంచంలోనే చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని బిలాల్ మజీద్ మతగురువు అబ్దుల్రషీద్ అన్నారు.
గిద్దలూరు, అక్టోబరు 16 : ప్రపంచంలోనే చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని బిలాల్ మజీద్ మతగురువు అబ్దుల్రషీద్ అన్నారు. శుక్రవారం షాదీఖానాలో బిలాల్ మజీద్ యూత్ కమిటీ వారు మహమ్మద్ ప్రవక్తపై టాలెంట్ టెస్టు నిర్వహించారు. కార్యక్రమంలో 100 మంది యువతీ యువకులు, మతగురువులు పాల్గొన్నారు.