పండుటాకులను మోసం చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-09-04T05:15:55+05:30 IST

ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించ డంతోపాటు ఉన్న పెన్షన్లలో కూడా కోతలు విధిస్తూ పండుటాకులను మోసం చేస్తున్నా రని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

పండుటాకులను మోసం చేస్తున్న ప్రభుత్వం
చీరాలలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ నేతల ధ్వజం

నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రాలు

చీరాల, సెప్టెంబరు 3: ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని  విస్మరించ డంతోపాటు ఉన్న పెన్షన్లలో కూడా కోతలు విధిస్తూ పండుటాకులను మోసం చేస్తున్నా రని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. సా మాజిక పెన్షన్లలో విధించిన కోతకు నిరసనగా శుక్రవారం టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతి నిధి సజ్జా చంద్రమౌళి, పులి వెంకట్రావు, కౌతవరపు జనా ర్దన్‌ తదితరులు ఎంపీడీవో సాంబశివరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3,000 ఇవ్వటం మాని ఏదో ఒక కుంటి సాకు చూపు తూ ఉన్న పెన్షన్లలో కోత విధించటం దారుణమన్నారు. వెంటనే పెన్షన్లు పాత పద్ధతిన ఇవ్వాలన్నారు. దీంతో పా టు ఇచ్చినమాట ప్రకారం పెన్షన్‌ పెంపును అమలుచే యాలని డిమాండ్‌ చేశారు. 

కార్యక్రమంలో స్ధానిక టీడీపీ నాయకులు ఉసురుపాటి సురేష్‌, ఏ.రామయ్య, టి.నాగే శ్వరరావు, రజని, లావణ్య, కిషోర్‌, వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

మార్టూరు: పెన్షన్‌దారుల తొలగింపును ఉపసంరించు కోవాలని, తక్ష ణమే రూ.3 వేల పెన్షన్‌ అమలుచేయాలని కోరుతూ శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏవో బి.శ్రీనివాసులకు టీడీపీ నాయకులు వినతిపత్రం అందచే శారు.  కార్యక్రమంలో తొండెపు ఆదినారాయణ, షేక్‌ ర జాక్‌, కామినేని జనార్దన్‌, పోపూరి శ్రీనివాసరావు, శానం పూడి చిరంజీవి, కామేపల్లి హరిబాబు, పెడవల్లి రామా రావు, మిన్నెకంటి రవి, తాటి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

అలాగే, యద్దనపూడి మండల కేంద్రంలో ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో శ్రీని వాసరావుకు  టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్ర మంలో రంగయ్య చౌదరి, కనపర్తి నాగేశ్వరరావు, రావిపాటి సీతయ్య, గుదే తారక రామారావు తదితరులు పాల్గొన్నారు.

 పెన్షన్ల తొలగింపును ఉపసంహరించుకోవాలి

చినగంజాం, సెప్టెంబరు 3: పేదలకు అందిస్తున్న సామాజిక పెన్షన్ల తొలగింపును ఉప సంహరించుకుని, తక్షణమే పెన్షన్‌ని మూడు వేల రూపాయలు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఎంపీడీ వో డీ.విజయలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటు న్న నిర్ణయాలతో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుం దని అన్నారు. గత నెలలో ఇంటిలో ఒకరికి మాత్రమే పెన్షన్‌ అంటూ లక్షలాది మందికి పెన్షన్‌లు దూరం చేశా రని చెప్పారు. 

కార్యక్రమంలో  టీడీపీ నాయకులు రాయని ఆత్మారావు, చెరుకూరి రాఘవయ్య, సయ్యద్‌ అబ్దుల్‌ కలాం అజాద్‌, తూమాటి శ్రీనివాసరావు, కె.శ్యాంబాబు, ఎ.రమేష్‌, వెంకటసత్యనారాయణ తదిత రులు పాల్గొన్నారు.  

పేదల కడుపు కొట్టొద్దు

పర్చూరు, సెప్టెంబరు 3: పెన్షన్‌ తొలగించి పేదల కడుపు కొట్టొద్దని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పింఛన్‌ల తొలగింపును నిరసిస్తూ శుక్రవారం ఎంపీడీవో కార్యాలయానికి పెద్దఎత్తున తరలివెళ్ళి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా టీడీపీ ఎస్సీసెల్‌ నాయకుడు బేతపూడి సురేష్‌ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రూ.3 వేలకు పెన్షన్‌ పెంచి ఇస్తామని చెప్పిన జగన్మోహన్‌ రెడ్డి  నేడు ఉన్నవాటిని తొలగింపు చర్యలకు పాల్పడటం హే యమైన చర్య అని అన్నారు.

కార్యక్రమంలో మానం హరిబాబు, అగ్నిగుండాల వెంకటకృష్ణారావు, కొల్లా శ్రీనివాసరావు,  షేక్‌ షంషుద్దీన్‌, కొండ్రగంటి శివనాగేశ్వరరావు, కొల్లా శివరాంప్రసాద్‌ తది తరులు పాల్గొన్నారు. 

అలాగే, కారంచేడులో తెలుగురైతు అధికార ప్రతినిధి యార్లగడ్డ అక్కయ్య చౌదరి ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తిరుములశెట్టి శ్రీహరి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యని ర్వాహక కార్యదర్శి షేక్‌ కాలేషా, బాలిగ శ్రీనివాస రావు, యార్గగడ్డ సురేష్‌, మల్లవరపు శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

ఇంకొల్లు: పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ టీడీపీ నా యకులు ఎంపీడీవో కృష్ణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, వీరగంధం ఆంజనేయులు, గుంజి వెం కట్రావు, పంగులూరి హనుమయ్య, బొడెంపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T05:15:55+05:30 IST