వాణిజ్య సముదాయం ఏర్పాటు అభినందనీయం

ABN , First Publish Date - 2021-12-31T04:49:02+05:30 IST

రామకూరు గ్రా మ పంచాయతీ పరిధిలో వాణిజ్య సముదాయం ఏర్పాటు అభినందనీయమని శాప్‌ నెట్‌ ఛైర్మన్‌, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

వాణిజ్య సముదాయం ఏర్పాటు అభినందనీయం
షాపింగ్‌కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న చైర్మన్‌ కృష్ణచైతన్య

శాప్‌ నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య పంగులూరు, డిసెంబరు 30 : రామకూరు గ్రా మ పంచాయతీ పరిధిలో వాణిజ్య సముదాయం ఏర్పాటు అభినందనీయమని శాప్‌ నెట్‌ ఛైర్మన్‌, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. రామకూరు గ్రామంలో రూ.16 లక్షల వ్య యంతో ప్రధాన కూడలిలో ఐదు గదులతో నిర్మిం చిన మానస్‌ వాణిజ్యసముదాయ నూతన భవనా న్ని గురువారం సాయంత్రం కృష్ణచైతన్య, సర్పంచ్‌ కొత్తపల్లి సుజాతలు ప్రారంభించారు. అనంతరం ఓటీఎస్‌ లబ్ధిదారులకు  జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ర్టేషన్‌ పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్‌ ఎర్రం శ్రీనివాసరెడ్డి, రాయిణి వెంకటసుబ్బారావు, ఉప సర్పంచ్‌ పెడవల్లి అశోక్‌, అడ్డగడ్డ ఆంజనేయులు, మాజీ సర్పంచ్‌ మానం సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి శిరీష, ఉప్పుతెళ్ల రా మాంజనేయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T04:49:02+05:30 IST