పథకాల అమలు తీరుపై కేంద్రం ఆరా
ABN , First Publish Date - 2021-10-28T07:03:15+05:30 IST
తమ ప్రభుత్వ నిధులతో అమలు జరుగుతున్న పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

జిల్లాలో పర్యటిస్తున్న ఇద్దరు సభ్యుల బృందం
ఒంగోలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వ నిధులతో అమలు జరుగుతున్న పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. క్షేత్రస్థాయిలో ఆ పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధి ఏమేరకు అన్న విషయమై పరిశీలన చేస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు సభ్యులతో కూడిన బృందం మూడు రోజులుగా జిల్లాలో పర్యటిస్తోంది. ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులతోపాటు గృహ నిర్మాణ, గ్రామీణ నీటిసరఫరా, పీఎంజీఎస్వై రోడ్లు, స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలిస్తున్నారు. తమిళనాడులోని నందిగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్ (డీమ్డ్ యూనివర్శిటీ)కి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ టి.భాస్కర్, డాక్టర్ మణికంఠల బృందం బుధవారం జిల్లాకు వచ్చింది. కేంద్రమే నేరుగా ఆ బృందాలు పర్యటించాల్సిన గ్రామాలను ఎంపిక చేసినట్లు సమాచారం. బల్లికురవ మండలం కొణిదెన, రాజుపాలెంలలో, చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామాల్లోనూ వారు పర్యటించి పరిశీలన చేశా రు. అలా గురు, శుక్రవారాల్లోనూ మరికొన్నింటిని పరిశీలించడంతోపాటు శని ారం జిల్లా అధికారులతో సమీక్ష చేసి కేంద్రానికి నివేదికను ఇవ్వనున్నారు.