వైభవంగా పృధులగిరి ధ్వజారోహణం

ABN , First Publish Date - 2021-03-25T04:32:52+05:30 IST

పృధులగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండోరోజైన బుధవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది.

వైభవంగా పృధులగిరి ధ్వజారోహణం
ధ్వజారోహణం చేస్తున్న ఆలయ అర్చకులు

మర్రిపూడి, మార్చి 24 : పృధులగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండోరోజైన బుధవారం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉభయదాతలు భవానీప్రసాద్‌, సుబ్బారావు, శ్రీహరి, వినయ్‌కుమార్‌లు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అంతకుముందు లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్‌కు ప్రధాన అర్చకులు నారాయణం, ఆదిశేషాచార్యులు, మారుతీ ఆచార్యులు అభిషేకం నిర్వహించారు. స్వామికి సహస్రనామ పూజ చేశారు. హోమం నిర్వహించారు. అనంతరం ధ్వజాన్ని ధ్వజస్తంభానికి వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆరోహణం చేశారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తులను పృధులగిరిపై ఊరేగించారు.


Updated Date - 2021-03-25T04:32:52+05:30 IST