వైసీపీ దాడులపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-20T05:50:59+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలుగు త మ్ముళ్లు మండిపడ్డారు. మంగళవారం మంగళగిరిలోని తె లుగుదేశం పార్టీ కేంద్ర ప్రధాన కార్యాలయంతోపాటు ఇ తర ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు చేయడంపై నిరనలు తెలియజేశారు.

వైసీపీ దాడులపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
ఒంగోలులో ర్యాలీ చేస్తున్న నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

ఒంగోలు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన

అడ్డుకున్న పోలీసులు


ఒంగోలు(కార్పొరేషన్‌), అక్టోబరు 19 : రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలుగు త మ్ముళ్లు మండిపడ్డారు. మంగళవారం మంగళగిరిలోని తె లుగుదేశం పార్టీ కేంద్ర ప్రధాన కార్యాలయంతోపాటు ఇ తర ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు చేయడంపై నిరనలు తెలియజేశారు. ఆ పార్టీ రాష్ట్ర క మిటీ పిలుపు మేరకు ఒంగోలులో తెలుగుదేశం పార్టీ శ్రే ణులు నిరసన తెలియజేశారు. తొలుత నగరంలో నిరసన ర్యాలీకి సిద్ధం కాగా, అప్రమత్తమైన పోలీసులు అడ్డుకోవ డంతో నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చో టు చేసుకుని కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు పార్టీ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియ జేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రా ష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, అధికార వైసీపీ కక్షపూరిత ధోరణితో దాడులకు పాల్పడుతోందని ఆరోపి ంచారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయగా, ఉ ద్యోగులు, పత్రికా విలేఖరులపై బరితెగించడం దారుణమ న్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో పోలీసులు, వైసీపీ తీరు ను తప్పు పట్టారు. టీడీపీ కార్యాలయానికి రక్షణ కల్పించ లేని పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ ను అడ్డుకోవడం అమానుషమని మండిపడ్డారు. ఽవైసీపీ దాడులను నిరసిస్తూ బుధవారం జిల్లాలో చేపట్టిన బంద్‌ ను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరా రు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరా వు, తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావుల పద్మజ, ఒం గోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు వేమూరి అశ్విని, తిప్పరమల్లి రవితేజ పలు వురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-20T05:50:59+05:30 IST