టీ దుకాణం యజమాని ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-20T05:52:02+05:30 IST
టీ దుకాణం యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘనట మంగళవారం సాయంత్రం అద్దంకి పట్టణంలోని రా జీవ్కాలనీలో చోటుచేసుకుంది.

అద్దంకిటౌన్ అక్టోబరు 19 : టీ దుకాణం యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘనట మంగళవారం సాయంత్రం అద్దంకి పట్టణంలోని రా జీవ్కాలనీలో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల మేరకు... రాజీవ్‌కాలనీలో నివాసం ఉండే తన్నీరు దుర్గప్రసాద్(26) భిక్షాలకాలనీ సమీపంలో ప్రధాన రహదారి వెంబడి దసరా రోజున టీ కే్ఫను ప్రారంభించాడు. మంగళవారం మధ్యా హ్నం ఇంటికి భోజనానికి వెళ్లిన దుర్గప్రసాద్ తిరిగి కేఫ్ వద్దకు రాలేదు. స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ప్రసాద్‌ను కిందకు దించి వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, 2 ఏళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం మృతుడి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. కేఫ్ ఏర్పాటుకు అధికంగా అప్పు చేయడం, అ ది సక్రమంగా నడవడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్నే హితులు, బంధువులు చెబుతున్నారు.