ధరల పెరుగుదలపై నేడు టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు

ABN , First Publish Date - 2021-08-28T05:15:57+05:30 IST

రాష్ట్రం లో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరస న ర్యాలీలు చేపట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు దామచర్ల జనార్దన్‌ తెలిపారు.

ధరల పెరుగుదలపై నేడు టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు
మాట్లాడుతున్న దామచర్ల జనార్దన్‌

రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల 

పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపు 


ఒంగోలు (కార్పొరేషన్‌) ఆగస్టు 27 : రాష్ట్రం లో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరస న ర్యాలీలు చేపట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు దామచర్ల జనార్దన్‌ తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చే సి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతగాని విధానా ల వల్ల పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధర లు విపరీతంగా పెరిగాయన్నారు. కరోనా మహ మ్మారి వల్ల ఉపాధి కోల్పోయి ఎంతోమంది ప్రజ లు ఇబ్బందులు పడుతున్నా వారిని ఆదుకోవ డం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శిం చారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ని రసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా ఒం గోలులో నిరసన ర్యాలీ చేపట్టినట్లు దామచర్ల చె ప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వర రావు, ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు కామే పల్లి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. 

 

 నేడు అద్దంకిలో భారీ ర్యాలీ : ఎమ్మెల్యే రవికుమార్‌ 


అద్దంకి: పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల పెంపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోయలేని భా రం మోపుతున్నదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. కేంద్రం విధిస్తున్న పన్నులకు అదనంగా భారీగా ఒడ్డిస్తూ ఆదాయ మార్గంగా మార్చుకున్నదని ధ్వజమెత్తారు. ప్ర భుత్వ తీరుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో శ నివారం అద్దంకిలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరల పెంపు  విషయంలో వైసీపీ ప్రభుత్వం రా ష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిందని ఎద్దేవా చే శారు. డీజిల్‌ ధరల ప్రభావం వ్యవసాయ రం గంపై పడి పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగు తున్నాయన్నారు. వెంటనే ధరలను తగ్గించి వ్య వసాయ రంగానికి 50 శాతం సబ్సిడీపై డీజిల్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. పెట్రో ధరల వి షయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శ నివారం పట్టణంలోని పోతురాజుగండి వద్ద ఉ న్న టీడీపీ కార్యాలయం నుంచి బంగ్లారోడ్డులోని అంబేడ్కర్‌ బొమ్మ వరకూ  ప్రదర్శన నిర్వహిస్తు న్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొనాలని కోరారు.


Updated Date - 2021-08-28T05:15:57+05:30 IST