టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2021-12-25T06:08:46+05:30 IST

టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మాట్లాడుతున్నమాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి (హనుమంతునిపాడు), డిసెంబరు 24: టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. హనుమంతునిపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా టీడీపీ కార్యవర్గ కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్ర మాట్లాడుతూ టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లో వివరించాలన్నారు. టీడీపీ అభివృద్ధికి పాటుపడుతూ స్థానిక సమస్యలపై ప్రజలకు అండగా నిలవాలన్నారు. ప్రధానంగా పేదల నుంచి ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడిని ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేయిస్తామన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు సానికొమ్ము తిరుపతిరెడ్డి, మురహరి నరసయ్య, వెంకటసుబ్బయ్య, గాయం రామిరెడ్డి, బాలనారాయణ, రామకృష్ణ, ప్రభుదాసు, శివకుమారి, తాతిరెడ్డి పిచ్చిరెడ్డి, హరనాథ్‌రెడ్డి, శేషయ్య, ఎర్రయ్య, దారా నారాయణ, గుమ్మా కొండయ్య, జిలాని, దేవిరెడ్డి శ్రీను, చిన్పపరెడ్డిలు పాల్గొన్నారు. సూళ్ళు చేపడుతున్న 

నూతన కార్యవర్గం ఎంపిక

తిమ్మారెడ్డిపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా కుందురు బ్రహ్మరెడ్డి, ఉపాధ్యక్షుడిగా రాజబాబు, ప్రధాన కార్యదర్శిగా బద్దెపూడి నాగయ్య, కార్యదర్శులుగా శింగనబోయిన వెంకటనరసయ్య, రామిరెడ్డి, ఎరకసాని నరసయ్యలతో పాటు 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐటీడీపీ కో ఆర్డినేటర్‌గా వంగేపురం రవికుమార్‌ను ఎన్నుకున్నారు. నూతనంగా ఎంపికైన కమిటీని టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర అభినందించారు.

Updated Date - 2021-12-25T06:08:46+05:30 IST