మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-12-26T05:08:38+05:30 IST

ఇటీవల యర్రగొండపా లెం నుంచి మార్కాపురం వస్తున్న మంత్రి కాన్వాయ్‌ వాహనం ఢీకొని మరణించిన మార్కాపురానికి చెందిన మహేష్‌, మహేశ్వరి కుటుం బాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాం డ్‌ చేశారు.

మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కందుల

మాజీ ఎమ్మెల్యే కందుల డిమాండ్‌ 

మార్కాపురం(వన్‌టౌన్‌), డిసెంబరు 25: ఇటీవల యర్రగొండపా లెం నుంచి మార్కాపురం వస్తున్న మంత్రి కాన్వాయ్‌ వాహనం ఢీకొని మరణించిన మార్కాపురానికి చెందిన మహేష్‌, మహేశ్వరి కుటుం బాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాం డ్‌ చేశారు. స్థానిక కంభం సెంటర్‌లోని టీడీపీ పట్టణ కార్యాలయంలో శనివారం  ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఈనెల 9న మోటర్‌ సైకిల్‌పై వస్తున్న దంపతులను మంత్రి కాన్వాయ్‌ ఢీకొట్టిన ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోవటంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది కుటుంబసభ్యులు వారిపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ కేసు లో రాత్రికి రాత్రి అధికారులు కార్లను మార్చి మంత్రి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యేందుకు కృషి చేస్తున్నారన్నారు. మంత్రి వాహనం ఢీ కొంటే పోలీసు శాఖ స్టిక్కర్లు మార్చారని ఇది దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. మంత్రి దగ్గర రూ.50 లక్షలు తీసుకొని పోలీసులు ఇటు వంటి పనులకు పాల్పడ్డారని పుకార్లు వినిపిస్తున్నాయన్నారు. ఈ సంఘటనపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్నారు. వాహనం స్టిక్కర్లు మార్చిన సంఘటనలో ఎవరెవరికి ముడుపులు అందాయో తెలుస్తుం దన్నారు. బాధిత కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిం ది పోయి మా వాహనం కాదనడం అన్యాయమన్నారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని కందుల ధైర్యం చెప్పారు.  జగన్‌కు వెలిగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని కందుల అన్నారు. మంత్రి ఫంక్షన్‌కు హాజరవు తున్నారే తప్ప ప్రాజెక్టును సందర్శించి నిర్వాసితుల సమస్యలను పరిష్కారిస్తారని ఈ ప్రాంత వాసులు ఆశిం చినా ఆయన పర్యటనలో వెలిగొండ లేదన్నారు. ఓటీఎస్‌ డబ్బుల వ సూళ్లతో పేదలను పీడించడం ఆపాలని డిమాండ్‌ చేశారు.  సినిమా టికెట్లు, మద్యం రేట్లు తగ్గించడం కాదు, విద్యుత్‌ చార్జీలు తగ్గించా లన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వక్కలగడ్డ మల్లికార్జున్‌, పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, టీడీపీ నాయకులు కొప్పుల శ్రీనివాసులు, పోరుమామిళ్ల విజయలక్ష్మి పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T05:08:38+05:30 IST