ఆర్టీసీ ఆర్‌ఎంగా సుధాకర్‌బాబు

ABN , First Publish Date - 2021-10-14T07:32:02+05:30 IST

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకాశం రీజనల్‌ మేనేజర్‌గా బి.సుధాకర్‌బాబు నియమితులయ్యారు.

ఆర్టీసీ ఆర్‌ఎంగా సుధాకర్‌బాబు

గుంటూరుకు విజయగీత బదిలీ 

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 13 : ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకాశం రీజనల్‌ మేనేజర్‌గా బి.సుధాకర్‌బాబు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేస్తున్న విజయగీత బదిలీ అయ్యారు. ఈమేరకు  బుధవారంఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. సుధాకర్‌బాబు విజయనగరం నుంచి ఉద్యోగోన్నతిపై జిల్లాకు వస్తున్నారు. విజయగీత ప్రకాశం ఆర్‌ఎంగా మూడేళ్ల రెండు నెలలు పనిచేశారు. ఆమెను గుంటూరు ఆర్‌ఎంగా బదిలీ చేశారు. నూతన ఆర్‌ఎం సుధాకర్‌బాబు దసరా అనంతరం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. Updated Date - 2021-10-14T07:32:02+05:30 IST