విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-11-02T05:55:34+05:30 IST

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో ఆజాదీకా ఆమృత మహోత్సవ్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న జడ్జి లోక్‌ అదాలత్‌, న్యాయ సంబంధమైన అంశాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
క్విస్‌లో జరిగిన ఆజాదీకా అమృత మహోత్సవ్‌ సదస్సులో ప్రసంగిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు

ఒంగోలువిద్య, నవంబరు 1: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో ఆజాదీకా ఆమృత మహోత్సవ్‌ సదస్సు  నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న జడ్జి లోక్‌ అదాలత్‌, న్యాయ సంబంధమైన అంశాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్విస్‌ విద్యాసంస్థల సెక్రటరీఅండ్‌ కరస్పాండెంట్‌ నిడమానూరి సూర్యకళ్యాణ చక్రవర్తి, అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావు, ప్రిన్సిపాళ్లు సి.వి.సుబ్బారావు, ఎన్‌.రాజే్‌ష, అడ్వకేట్‌ సీహెచ్‌.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-02T05:55:34+05:30 IST