విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-10T05:16:31+05:30 IST

అర్ధవీడు మం డలం రంగాపురం గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు.

విద్యార్థుల ఆందోళన
ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యార్థినీ విద్యార్థులు

వేధిస్తున్న ఉపాధ్యాయులు, గదుల కొరత 

బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకోలు

కంభం (అర్ధవీడు), డిసెంబరు 9 : అర్ధవీడు మం డలం రంగాపురం గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ పాఠశాలలో చాలీచాలని ఉపాధ్యాయ సిబ్బంది తోపాటు తరగతి గదుల కొరత వేధిస్తోంది. దాంతో పాటు పాఠశాల వేళల్లో బస్సును నడపాలని కోరుతూ విద్యార్థినీవిద్యార్థులు స్కూల్‌ ఆవరణలో ప్లకార్డులతో నిరసనకు దిగారు. పీపుల్స్‌ యాక్షన్‌ ఫోరం రాష్ట్ర ఉపా ధ్యక్షుడు కొత్తపల్లి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ వెలగలపాయ లోయలోని రంగాపురం జడ్పీ స్కూల్‌, వెలగలపాయ, బొమ్మిలింగం, గన్నేపల్లి, రంగాపురం గ్రామాల విద్యార్థులు 171 మంది పాఠశాలకు వస్తారని తెలిపారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లందరి కీ గదులు లేకపోవడం, 9 మంది ఉపాధ్యాయులు ఉం డాల్సి ఉండగా కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మా త్రమే ఉండడంతో 171 మంది విద్యార్థులకు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిలబస్‌ పూర్తికాక ఇ బ్బందులు పడుతున్నారని చెప్పారు. వేళలకు బస్సులు  రాకపోవడంతో ఉదయం 9గంటలకు రావలసిన విద్యార్థులు 9.30గంటలకు వస్తున్నారని తెలిపారు. సాయం త్రం 4 గంటలకు వెళ్లాల్సిన విద్యార్థులు 2.30 గంటలకే ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందన్నారు. నాడు-నేడు కింద తరగ తి గదులు, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని పాలకులు చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పథ కం అమలుకు నోచుకోవడం లేదని విజయ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  విద్యాశాఖ ఉన్నతాధికారు లు రంగాపురం హైస్కూలుకు ఉపాధ్యాయులను భర్తీ చేయాలని, అదనపు గదుల నిర్మాణానికి చర్యలు తీసు కోవాలని, బస్సులు వేళకు తిరిగేలా చూడాలని విద్యా ర్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. 


Updated Date - 2021-12-10T05:16:31+05:30 IST