మంచినీటి బావిలో జారిపడి విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-05-08T07:44:22+05:30 IST

ప్రమాదవుశాత్తు విద్యార్థి మంచినీటి బావిలో జారిపడి మృతి చెందాడు.

మంచినీటి బావిలో జారిపడి విద్యార్థి మృతి

మరొక బాలుడి పరిస్థితి విషమం

నేకునాంపురం (వలేటివారిపాలెం) మే 7 :  ప్రమాదవుశాత్తు విద్యార్థి మంచినీటి బావిలో జారిపడి మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో మండలంలోని నేకునాంపురం ఎస్సీ కాలనీకి చెందిన వలేటి వంశీ చనిపోయాడు. మరో విద్యార్థి మద్దాలి నానిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రయివేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు కావడంతో వలేటి వంశీ, మద్దాలి నానిలు తన స్నేహితులతో కలిసి తాటికాయలకు వెళ్లారు. దాహం వేయడంతో అందరూ కలిసి  బావి వద్దకు మంచినీళ్లు తాగుతుండగా ప్రమాదవుశాత్తు వంశీ, నానిలు జారి బావిలో పడ్డారు.  వెంటనే స్నేహితులు వారిద్దరినీ బయటకు తీసి మోటారు బైకుపై కందుకూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా వంశీ మార్గమధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నానిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు. వంశీ మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Updated Date - 2021-05-08T07:44:22+05:30 IST