కొరిశపాడు ఎత్తిపోతలకు నిధుల కోసం కృషి

ABN , First Publish Date - 2021-12-20T05:27:57+05:30 IST

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు (కలెక్టరేట్‌), డిసెంబరు 19 : కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధుల విడుదలకు కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్థానిక ఎన్‌ఎస్పీ అతిథిగృహంలో ఆదివారం ఆయన ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్ధంతరంగా నిలిచిపోయిన కొరిశపాడు ఎత్తిపోతల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

కొరిశపాడు ఎత్తిపోతలకు నిధుల కోసం కృషి
ఎన్‌ఎస్పీ అతిథి గృహంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి బాలినేని

   మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు (కలెక్టరేట్‌), డిసెంబరు 19 : కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధుల విడుదలకు కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్థానిక ఎన్‌ఎస్పీ అతిథిగృహంలో ఆదివారం ఆయన ఎత్తిపోతల పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్ధంతరంగా నిలిచిపోయిన కొరిశపాడు ఎత్తిపోతల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తూర్పుపాలెం, పెద్దూరు గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తించేలా చూస్తానని, ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.  ఈసందర్భంగా పథకానికి సంబంధించి రూ.213 కోట్లతో తయారు చేసిన నివేదికను కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంత్రికి అందజేశారు. సమావేశంలో జేసీ వెంకట మురళి, ప్రత్యేక ఉపకలెక్టర్‌ లక్ష్మి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ వరలక్ష్మీ, డీఈ సాదిక్‌బాషా తదితరులు ఉన్నారు. నిలిచిపోయిన పథకాన్ని పునర్నిర్మించాలని కొరిశపాడు ఎత్తిపోతల పోరాట సమితి నాయకులు లేళ్ల సుబ్బారెడ్డి, పమిడి సుబ్బయ్య, కొరిశపాడు జడ్పీటీసీ టి.వెంకటరమణ మంత్రిని కోరారు.  

Updated Date - 2021-12-20T05:27:57+05:30 IST