ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2021-11-29T04:46:10+05:30 IST

ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది.

ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకం
చిల్లకంపతో అల్లుకుపోయిన పనుకుమడుగు చెరువు

నిండని చెరువులు

వెలిగొండ ఊట నీటితో నిండుగా గంటవానిపల్లె చెరువు

అరకొర వానలతో మిగిలిన వాటికి చేరని నీరు 

పెద్ద దోర్నాల, నవంబరు 27: ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. పిలిస్తే పలికే కరువు ప్రాంతాల్లో వానలు పడితే.. ఒడిసిపట్టాలని ప్రభుత్వం మండలంలో ప్రతి గ్రామాన చెరువులు తవ్వించింది. ఆ చెరువుల కింద ఉన్న ఆయకట్టు భూములలో ఆరుతడి పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాబావంతో  చెరువులకు వరదనీ రు చేరలేదు. దీంతో ఆయకట్టు భూములలో సాగు ప్రశ్నా ర్థకంగా మారింది. మండలంలో 16 చెరువులు ఉన్నాయి. వాటి కింద 8,049.62 ఎకరాలు ఆయకట్టుగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. 

కాలం బాగుంటే వర్షాలు సంవృద్ధిగా కురిస్తే చెరువులు పూర్త స్థాయిలో నిండుతాయి. పది వెేల ఎకరాలకు పైగా సాగవుతాయి. పరిసర వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు కూడా పెరిగి మరికొంత భూములు సాగులోకి వస్తాయి. అయితే, ఈ ఏడాది అరకొర వానలు కురిసి పంటలకు తెగుళ్లు వ్యాప్తికి దోహదపడ్డాయి. చిన్నగుడిపాడు చెరువు  కింద 324.12 ఎకరాలు, వై.చెర్లోపల్లి చెరువు కింద 634.26 ఎకరాలు, పెద్ద బొమ్మలాపురం చెరువు కింద 4501.82 ఎకరాలు, చట్టుతాండా చెరువు కింద 155.06 ఎకరాలు ఉన్నాయి. అలాగే, తీగలేరు నల్లకాలువ కింద 107.04 ఎకరాలు, వెన్నా రామిరెడ్డి కుంట కింద 180.06 ఎకరాలు, గంటవానిపల్లె చెరువు కింద 840.34 ఎకరాలు, తిమ్మాపురం చెరువు కింద 302.13 ఎకరాలు, అయినముక్కుల చెరువు కింద 487 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా పనుకుమడుగు చెరువు కింద 268.10 ఎకరా లు, వెన్నా పాపిరెడ్డి కుంట కింద 34.98 ఎకరాలు, కటకానిపల్లె చెరువు కింద 42.98 ఎకరాలు, రామచంద్ర కోట కుం ట కింద 35.99 ఎకరాలు, ఆవుల రెడ్డి కుంట కింద 69.98 ఎకరాలు, చిలకచెర్ల చెరువు కింద 25.59 ఎకరాలు, అయ్య న్న కుంట కింద 39.99 ఎకరాలు ఆయకట్టుగా ఉన్నాయి. వర్షాలు బాగా కురిస్తే చెరువులు, కుంటలు నిండితే దాదా పు 70 శాతం భూములు సాగులోకి వస్తాయి.  ఇటీవల చి రుజల్లులు మాత్రమే కురిశాయి. దీంతో చెరువులకు కుంటలకు నీరు చేరలేదు. ఈనేపథ్యంలో రబీ సీజన్‌లో సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆందోళనలో పడ్డారు. ఎక్కువ మంది రైతులు మినుము, జొన్నను సాగు చేశారు. కటకానిపల్లె, తిమ్మాపురం చెరువులతో పాటు కొన్ని కుం టలు ఆక్రమణలకు గురయ్యాయి. పనుకుమడుగు, పెద్దబొమ్మలాపురం చెరువుల తూములు మరమ్మతులకు గురయ్యాయి. మరికొన్ని చెరువుల్లో చిల్లకంప పెరిగి అడవిని తలపిస్తున్నాయి.

గంటవానిపల్లె చెరువుకు జలకళ

తరతరాలుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు వెలుగొండ ప్రాజెక్టు వరప్రసాదినిగా మారింది. కేవలం నిర్మాణం పనులతో వచ్చే ఊట నీటితో గంటవానిపల్లె చెరువు నిండుగా కన్పిస్తోంది.  చెరువు జలకళతో పరి సర ప్రాంతాల రైతులకు భరోసా నిస్తోంది. ప్రాజెక్టు పూర్త యి సాగునీటిని అందిస్తే పచ్చని పైర్లతో ఈ ప్రాంతం స స్యశ్యామలమవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అయితే పలు సాకులతో ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతం ప్రజలు, రైతుల్లో నిస్తేజం నెలకొంది.

Updated Date - 2021-11-29T04:46:10+05:30 IST