ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-31T06:30:52+05:30 IST

స్థానిక మార్కెట్‌యార్డులో దర్శి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం దర్శి సొసైటీ చైర్మన్‌ పూసల చిన్నయ్య ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

దర్శి, డిసెంబరు 30 : స్థానిక మార్కెట్‌యార్డులో దర్శి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం దర్శి సొసైటీ చైర్మన్‌ పూసల చిన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్రాలు ఆరంబించినట్లు చెప్పారు. దళారులతో మోసపోకుండా రైతులు పండించిన పంటను కేంద్రా ల్లో విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కోపరేటివ్‌ సొసైటీ డైరెక్టర్‌ వేమిరెడ్డి చెన్నారెడ్డి, వైసిపీ నాయకులు యర్రయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T06:30:52+05:30 IST