రూ.3.60 కోట్లతో శ్రీవారి ఆలయ పునఃనిర్మాణం

ABN , First Publish Date - 2021-02-06T05:32:24+05:30 IST

అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.3.60 కోట్లతో పునర్నిర్మించనున్నారు. అందులో రూ.కోటి స్థానికులు సేకరిస్తుండగా, టీటీడీ రూ.2.60 కోట్లు ఇస్తోంది.

రూ.3.60 కోట్లతో శ్రీవారి ఆలయ పునఃనిర్మాణం



రూ. 2.30 కోట్లు మంజూరు చేసిన టీటీడీ


అద్దంకి, ఫిబ్రవరి 5 : అద్దంకి  పట్టణంలోని కాకానిపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.3.60 కోట్లతో పునర్నిర్మించనున్నారు. అందులో రూ.కోటి స్థానికులు సేకరిస్తుండగా, టీటీడీ రూ.2.60 కోట్లు ఇస్తోంది.  కాకానిపాలెంలో శ్రీవేంకటేశ్వరస్వా మి ఆలయం పురాతనమైనది కావడంతో శిథిలావస్థకు చేరింది. దీని మరమ్మతులకు గతంలో టీటీడీ రూ.30లక్షలు మంజూరు చేసింది. అయితే ఆలయాన్ని పునర్ని ర్మి ంచాలని భావించిన స్థానికులు టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డిని కలిశారు.  రూ.కోటి స్థానికంగా సమకూర్చుకుంటామని, మిగిలిన మొత్తం టీటీడీ నుంచి  ఇప్పించాలని కోరారు. ఇప్పటికే రూ. 30 లక్షలు కేటాయించి ఉన్నందున, మిగిలిన రూ.2.30 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. 


Updated Date - 2021-02-06T05:32:24+05:30 IST