జడ్పీ సీఈవోగా సరళ
ABN , First Publish Date - 2021-01-12T07:03:24+05:30 IST
జిల్లా పరిషత్ సీఈవోగా సరళావందనం నియమితులయ్యారు. ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
ఒంగోలు(జడ్పీ), జనవరి 11 : జిల్లా పరిషత్ సీఈవోగా సరళావందనం నియమితులయ్యారు. ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ పోలా భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు స్పెషల్ కలెక్టర్‌గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ చేతన్‌కు కొవిడ్ వ్యాక్సినేషన్ పర్యవేక్షణ కూడా ఇచ్చారు. ఆయనకు పని ఒత్తిడి దృష్ట్యా జడ్పీ సీఈవో బాధ్యత(అదనపు)లను సరళావందనంకు అప్పగించినట్లు తెలుస్తోంది.