కర్నూలుకు ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2021-10-30T04:42:44+05:30 IST
దీపావళి, ఇతర పండుగలను పురస్కరించుకుని మచిలీపట్నం నుంచి గిద్దలూరు మీదుగా కర్నూలు పట్టణానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు టైంటేబుల్‌ను విడుదల చేశారు. 07237 నెంబరుతో మచిలీపట్నం నుంచి నవంబరు 6వ తేదీన ఈ ప్రత్యేక రైలు ప్రారంభం కానున్నది. వారానికి మూడు రోజులు మాత్రమే ఈ రైలు తిరగనున్నది. మచిలీపట్నం నుంచి ప్రతి శనివారం, మంగళవారం, గురువారాలలో ఈ రైలు ప్రారంభం కానుండగా కర్నూలు నుంచి ప్రతి ఆదివారం బుధ, శుక్రవారాలలో రైలు తిరుగుతుంది.
గిద్దలూరు, అక్టోబరు 29 : దీపావళి, ఇతర పండుగలను పురస్కరించుకుని మచిలీపట్నం నుంచి గిద్దలూరు మీదుగా కర్నూలు పట్టణానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు టైంటేబుల్‌ను విడుదల చేశారు. 07237 నెంబరుతో మచిలీపట్నం నుంచి నవంబరు 6వ తేదీన ఈ ప్రత్యేక రైలు ప్రారంభం కానున్నది. వారానికి మూడు రోజులు మాత్రమే ఈ రైలు తిరగనున్నది. మచిలీపట్నం నుంచి ప్రతి శనివారం, మంగళవారం, గురువారాలలో ఈ రైలు ప్రారంభం కానుండగా కర్నూలు నుంచి ప్రతి ఆదివారం బుధ, శుక్రవారాలలో రైలు తిరుగుతుంది. రైల్వేశాఖ విడుదల చేసిన సమాచారం మేరకు నవంబరు 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30 తేదీలలో మచిలీపట్నం నుంచి బయలుదేరుతుంది. 07238 నెంబరుతో నవంబరు 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, డిసెంబరు 1వ తేదీన కర్నూలు నుంచి బయలు దేరనున్నది.
సమయాలు
మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరే ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, దొనకొండ, మార్కాపురం, కంభం మీదుగా రాత్రి 9.30 గంటలకు గిద్దలూరు చేరుతుంది. నంద్యాల, డోన్ మీదుగా కర్నూలుకు తెల్లవారుజామున 5.10 గంటలకు చేరుతుంది. తిరిగి ఈ రైలు కర్నూలులో రాత్రి 8గంటలకు బయలుదేరి గిద్దలూరుకు 11.29 గంటలకు చేరుకుని విజయవాడకు తెల్లవారుజామున 4.50కి, మచిలీపట్నంకు 7.05 గంటలకు చేరుతుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈరైలును పొడిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.